ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kaleshwaram: డీపీఆర్‌ ఆమోదించకుండానే బ్యారేజీలపై నిర్ణయం!

ABN, Publish Date - Jul 16 , 2024 | 04:57 AM

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)కు ఆమోదం లేకుండానే బ్యారేజీలపై నిర్ణయం తీసుకున్నారని విద్యుత్తు రంగ నిపుణుడు కంచర్ల రఘు చెప్పారు.

  • తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత ఉంది

  • జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌కు తెలిపిన విద్యుత్తు రంగ నిపుణుడు రఘు

హైదరాబాద్‌, జూలై 15 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ఎత్తిపోతల పథకం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)కు ఆమోదం లేకుండానే బ్యారేజీలపై నిర్ణయం తీసుకున్నారని విద్యుత్తు రంగ నిపుణుడు కంచర్ల రఘు చెప్పారు. ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకంలోతుమ్మిడిహెట్టి వద్ద నిర్మించతలపెట్టిన ప్రదేశంలో 165 టీఎంసీల నీటి లభ్యత ఉందని, అక్కడ బ్యారేజీ కట్టి ఉంటే ఎల్లంపల్లి దాకా 2 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చేదని గుర్తు చేశారు. సోమవారం జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ ముందు రఘు విచారణకు హాజరయ్యారు.


అనంతరం విలేకరులతో మాట్లాడారు. నీటి లభ్యత లేదని, 152 మీటర్లకు తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కట్టడానికి మహారాష్ట్ర అంగీకరించలేదనే కారణాలు చూపించి, మేడిగడ్డ వద్ద బ్యారేజీ కట్టడంతో 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు లేకుండా పోయిందని ఆక్షేపించారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కడితే 71 కిలోమీటర్ల(మైలారం) దాకా గ్రావిటీతో సాగునీరు అందేదని, దీనివల్ల ఎత్తిపోతల పథకాల కరెంట్‌ బిల్లులు కూడా తగ్గేవని గుర్తుచేశారు.


ఎల్లంపల్లి నుంచి 100 కిలోమీటర్ల దిగువన మేడిగడ్డ బ్యారేజీ కట్టడం వల్ల రూ.వేల కోట్ల వృధాతో పాటు ఆర్థికంగా నష్టం చే కూరిందని, అంతేకాకుండా ఏటా రూ.వందల కోట్లు కరెంట్‌ బిల్లుల కోసం వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కాంట్రాక్టు ఒప్పందాల్లో అవకతవకలు జరిగాయని రఘు ఆరోపించారు. బ్యారేజీ ఎఫ్‌ఆర్‌ఎల్‌ ఎగువన పంప్‌హౌ్‌సల సర్వీసు బే కట్టాల్సి ఉండగా దిగువన కట్టారని.. అందుకే పంప్‌హౌ్‌సల్లోకి నీరు చేరుతుందని చెప్పారు. కాగా, కేంద్ర జలశక్తి శాఖ మాజీ సలహాదారు వెదిరె శ్రీరామ్‌ మంగళవారం కమిషన్‌ ఎదుట హాజరుకానున్నారు.

Updated Date - Jul 16 , 2024 | 04:57 AM

Advertising
Advertising
<