ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kaleshwaram: మేడిగడ్డ బ్యారేజీ అధికారుల్లో గుబులు

ABN, Publish Date - May 20 , 2024 | 03:11 AM

కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీరింగ్‌ అధికారుల్లో కలవరం మొదలైంది. భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు బాధ్యులపై, పనులు పూర్తికాకముందే సర్టిఫికెట్‌ జారీ చేసిన ఇంజనీరింగ్‌ అధికారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని సీఎం రేవంత్‌ రెడ్డి ఉన్నతాధికారులను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. ఈ విషయాన్ని సీఎం సీరియ్‌సగా తీసుకొని కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నారని, తమపై వేటు కూడా వేసి అవకాశముందని ఇంజనీరింగ్‌ అధికారుల్లో టెన్షన్‌ మొదలైంది.

  • నిర్లక్ష్యం వహించిన ఇంజనీర్లపై చర్యలకు ముఖ్యమంత్రి ఆదేశించడంతో కలవరం

  • ఆయన పర్యటనకు ముందే చర్యలు!

మహదేవపూర్‌ రూరల్‌, మే 19: కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీరింగ్‌ అధికారుల్లో కలవరం మొదలైంది. భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు బాధ్యులపై, పనులు పూర్తికాకముందే సర్టిఫికెట్‌ జారీ చేసిన ఇంజనీరింగ్‌ అధికారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని సీఎం రేవంత్‌ రెడ్డి ఉన్నతాధికారులను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. ఈ విషయాన్ని సీఎం సీరియ్‌సగా తీసుకొని కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నారని, తమపై వేటు కూడా వేసి అవకాశముందని ఇంజనీరింగ్‌ అధికారుల్లో టెన్షన్‌ మొదలైంది. ప్రధానంగా మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ సమయంలో కుంగిన బ్లాక్‌-7కు బాధ్యత వహించిన ఓ కీలక ఇంజనీరింగ్‌ అధికారిపై ఇప్పటికే ఒకసారి విచారణ పూర్తయింది. మరోసారి ఆయనపై అంతర్గత విచారణ జరుగుతున్నట్టు ఆ శాఖలో చర్చ సాగుతోంది.


బ్యారేజీలో పనులు పూర్తవకున్నా అప్పటి ఈఎన్సీ ప్రోద్బలంతోనే ఆ అధికారి పూర్తయినట్టు సర్టిఫికెట్‌ ఇచ్చారనే ఆరోపణలున్నాయి. బ్యారేజీ కుంగిన్పటి నుంచి తనపై ఎలాంటి రిమార్క్‌ రానివ్వకుండా ఆ కీలక అధికారి పలుకుబడి కలిగిన పలువురు నేతలతో పైరవీలు చేయించుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఆయనతో పాటు సహచర ఇంజనీర్లపై చర్యలు తీసుకొనే అవకాశం లేకపోలేదనే చర్చ సాగుతోంది. మరో వారంలో సీఎం కన్నెపల్లి, అన్నారం, సుందిళ్ల పంప్‌హౌ్‌సలను సందర్శించనున్నారు. ఈ లోగానే సర్కారు చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది. మహదేవపూర్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలో పనిచేసే కీలక అధికారితో పాటు ఇక్కడి నుంచి రామగుండం కార్యాలయానికి బదిలీపై వెళ్లిన మరొకరిపై చర్యలకు సిద్ధమైనట్లు సమాచారం.

Updated Date - May 20 , 2024 | 03:11 AM

Advertising
Advertising