ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Bandi Sanjay: మళ్లీ కాళేశ్వరం వెళ్లాల్సిన అవసరం ఏముంది?

ABN, Publish Date - Feb 13 , 2024 | 02:48 PM

Telangana: మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు సీఎం రేవంత్ సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బయలుదేరిన విషయం తెలిసిందే. ఈ విషయంపై బీజేపీ ఎంపీ బండిసంజయ్ స్పందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

కరీంనగర్, ఫిబ్రవరి 13: మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు సీఎం రేవంత్ (CM Revanth Reddy) సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బయలుదేరి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ విషయంపై బీజేపీ ఎంపీ బండిసంజయ్ (BJP MP Bandi Sanjay) స్పందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై (Congress Government) విరుచుకుపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. మళ్లీ కాళేశ్వరం వెళ్లాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. మంత్రులు, ఇంజనీర్లు ఎప్పుడో కాళేశ్వరం వెళ్లి నివేదిక ఇచ్చారు కదా అని అన్నారు. కాళేశ్వరం అక్రమాలపై సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని నిలదీశారు. కృష్ణా నీటి పేరుతో బీఆర్ఎస్, కాళేశ్వరం పేరుతో కాంగ్రెస్ డ్రామాలాడుతోందని విమర్శించారు. ముక్కు నేలకు రాసి బీఆర్ఎస్ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హామీలను గాలికొదిలేసినందుకు కాంగ్రెస్ క్షమాపణ కోరాలన్నారు. అసెంబ్లీ విలువైన సమయాన్ని వృధా చేస్తారా అంటూ మండిపడ్డారు. ప్రజలకిచ్చిన హామీలను గాలికొదిలేశారన్నారు. ‘‘మేం కొట్లాడుతుంటే, నిధులిస్తుంటే కాంగ్రెస్‌కు ఓట్లేయడం న్యాయమా’’ అని బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 13 , 2024 | 02:48 PM

Advertising
Advertising