ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bandi Sanjay: నేను మఠం పెట్టుకుంటే.. మీ అయ్య బార్ పెట్టుకుంటాడా?.. కేటీఆర్‌పై బండి ఫైర్

ABN, Publish Date - Jan 29 , 2024 | 12:28 PM

Telangana: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ కౌంటర్లు.. బీజేపీ ఎంపీ ప్రతికౌంటర్లతో కరీంనగర్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి.

హైదరాబాద్, జనవరి 29: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ (BRS Working President KTR) కౌంటర్లు.. బీజేపీ ఎంపీ బండి సంజయ్ (BJP MP Bandi Sanjay) ప్రతికౌంటర్లతో కరీంనగర్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలే టార్గెట్‌గా బీఆర్ఎస్‌, బీజేపీ పార్టీలు ఒకరిపై ఒకరు నిప్పులు చెరుగుతున్నాయి. కేటీఆర్, బండి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. తాజాగా మరోసారి కేటీఆర్‌పై బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పనిలో పనిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పైనా వ్యాఖ్యలు చేశారు.

‘‘నేను మఠం పెట్టుకుంటే.. మీ అయ్య బార్ పెట్టుకుంటాడా.. నువ్వు మసీదు పెట్టుకుని నమాజ్ చేసుకుంటూ ఉండు’’ అంటూ కేటీఆర్‌పై సెటైర్ విసిరారు. యాదాద్రిని వ్యాపార కేంద్రం చేశారని మండిపడ్డారు. కరీంనగర్ బీఆర్‌ఎస్ అభ్యర్థి నాస్తికుడని.. కేటీఆర్ కూడా నాస్తికుడే అని అన్నారు. కరీంనగర్ బీఆర్‌ఎస్ అభ్యర్థి పెద్ద మేధావిలాగా ఫోజ్ కొడతారని బండి సంజయ్ దుయ్యబట్టారు.


ఆ హక్కు బీఆర్‌ఎస్‌కు లేదు...

బండి సంజయ్ ఇంకా మాట్లాడుతూ... జీపీలకు బీఆర్‌ఎస్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లించారని ఆరోపించారు. సర్పంచ్‌లు అప్పుల పాలయ్యారని... సర్పంచ్‌ల ఆందోళనకు మద్దతు ఇస్తామన్నారు. సర్పంచ్‌లతో పనులు చేయించి.. బిల్లులు ఇవ్వలేదన్నారు. గత ప్రభుత్వం పేరు చెప్పి.. ఈ ప్రభుత్వం తప్పించుకోవద్దని హితవుపలికారు. సర్పంచ్‌ల సమస్యలపై అడిగే హక్కు బీఆర్‌ఎస్‌కు లేదన్నారు. బీఆర్‌ఎస్ కొత్త డ్రామా మొదలు పెట్టిందన్నారు. తెలంగాణలో పది ఎంపీ సీట్లు గెలుస్తామని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 29 , 2024 | 12:37 PM

Advertising
Advertising