ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MLC Kavitha: జగిత్యాలలో ఆదివారం ఎమ్మెల్సీ కవిత పర్యటన

ABN, Publish Date - Dec 15 , 2024 | 07:09 AM

తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం జగిత్యాలలో పర్యటించనున్నారు. దరూర్ ఎస్సారెస్పి కెనాల్ అంబేద్కర్ విగ్రహం వద్ద క్యాడర్‌ను ఉద్దేశించి కవిత ప్రసంగిస్తారు.

హైదరాబాద్: తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ (BRS MLC) కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha)ఆదివారం జగిత్యాలలో (Jagityala) పర్యటించనున్నారు (Visit). ఢిల్లీ లిక్కుర్ కుంభకోణం కేసులో అరస్టయి జైలు నుంచి విడుదల అయ్యాక ఆమె తొలి పర్యటన ఇది. కాగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరారు. ఆయన బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు కవిత అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ఆయినా ఆయన పార్టీ మారారంటూ ఇటీవల పార్టీ సమావేశంలో సంజయ్ కుమార్‌పై కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. దరూర్ ఎస్సారెస్పి కెనాల్ అంబేద్కర్ విగ్రహం వద్ద క్యాడర్‌ను ఉద్దేశించి కవిత ప్రసంగిస్తారు.


కాగా సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చి, అవహేళన చేస్తున్నారని తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. శనివారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘‘తెలంగాణ అస్తిత్వంపై దాడి’’ అంశంపై ఆమె రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. తెలంగాణ తల్లి పేరుతో రేవంత్‌ ఏర్పాటు చేసిన రూపాన్ని కాంగ్రెస్‌ మాతగా నామకరణం చేద్దామని కవిత తీర్మానించారు. బతుకమ్మను తెలంగాణ తల్లి చేతిలో నుంచి తీసేయడం తెలంగాణ సంస్కృతిపై దాడేనని, దీన్ని తెలంగాణ సమాజమంతా వ్యతిరేకించాలని కవిత పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ పాలకులు తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చి ప్రజలందరినీ అవమానించారని కేవీ రమణాచారి ఆరోపించారు.


తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చడాన్ని చరిత్ర హర్షించదని ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారిణి తిరునగరి దేవకీదేవి చెప్పారు. ఉద్యమకాలం నాటి తెలంగాణ తల్లి విగ్రహాలను తాకితే జనం చూస్తూ ఊరుకోరని, తిరగబడతారని తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్‌ హెచ్చరించారు. తెలంగాణ తల్లి రూపాన్ని మార్చడమంటే శిల్పిగా తనను చంపేసినట్టేనని తెలంగాణ తల్లి రూపశిల్పి బీవీఆర్‌ చారి చెప్పారు. కార్యక్రమానికి తెలంగాణ గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ అయాచితం శ్రీధర్‌ సభాధ్యక్షత వహించగా, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్‌, సురభి వాణీదేవి, మాజీ ఎమ్మెల్సీ దేవీప్రసాద్‌, బీసీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌, దళిత స్త్రీవాద రచయిత్రి గోగు శ్యామల, విశ్లేషకుడు వి. ప్రకాష్‌, ఆచార్య కె. సీతారామారావు, సీనియర్‌ జర్నలిస్టులు టంకశాల అశోక్‌, వేణుగోపాలస్వామి, జమాతే ఇస్లామీ ప్రతినిధి హమీద్‌ ముహమ్మద్‌ ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

చంద్రబాబు: నాడు, నేడు, రేపు..

ఆస్తి కోసం కన్నవారిని కడతేర్చాడు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 15 , 2024 | 07:09 AM