MLA Kaushik Reddy: నా ఫోన్ ప్రభుత్వం ట్యాప్ చేస్తోంది: కౌశిక్ రెడ్డి
ABN, Publish Date - Sep 05 , 2024 | 11:59 AM
కరీంనగర్ జిల్లా: తన ఫోన్‌ను ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని, ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీల ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయని, సీపీ ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నారని.. తమ ఫోన్ ట్యాప్ చేయరని గ్యారంటీ ఏమిటని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆయన కరీంనగర్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..
కరీంనగర్ జిల్లా: తన ఫోన్ (Phone)ను ప్రభుత్వం ట్యాప్ (Tap) చేస్తోందని, ప్రతి ఎమ్మెల్యే (MLA), ఎమ్మెల్సీ (MLC), ఎంపీల ఫోన్లు ట్యాపింగ్ (MPs phones Tapping ) అవుతున్నాయని, సీపీ ఫోన్ (CP Phone) కూడా ట్యాప్ చేస్తున్నారని.. తమ ఫోన్ ట్యాప్ చేయరని గ్యారంటీ ఏమిటని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (MLA Padi Kaushik Reddy) అన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆయన కరీంనగర్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రుణ మాఫీ కాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్రంలో కేవలం 40 శాతం మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని, ఏక కాలంలో రుణ మాజీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు కాదా అని అన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఫండ్స్ కాంగ్రెస్ ఫండ్స్ కావని, ఇవి ప్రజల సొమ్మని అన్నారు. తన నియోజకవర్గంలో ఓడిపోయినోడు చెక్కులు పంచుతుండని.. తెలంగాణలో పరిపాలన దరిద్రంగా జరుగుతోందని కౌశిక్ రెడ్డి విమర్శించారు.
కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ కుమార్‌ను అడుగుతున్నా.... పార్లమెంట్ పరిధిలో సీపీ ఫోన్ ట్యాప్ జరిగినప్పుడు ఎందుకు స్పందించరని పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. దీనిపై ఖచ్చితంగా సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాగా అధికారుల కోసం బ్లాక్ బుక్ రెడీ చేశానని.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అధికారులకు బ్లాక్ డేస్ ఉంటాయని పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) వార్నింగ్ ఇచ్చారు.
కాగా రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక పింఛన్ల పెంపు గురించి మర్చిపోయారని, మూడు నెలల పింఛన్లను రేవంత్ రెడ్డి ఆపారని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. వంద రోజుల్లో పింఛన్లు పెంచుతామని చెప్పిన రేవంత్ రెడ్డి ఎందుకు మాట తప్పారని ప్రశ్నించారు. తాము ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. కుటుంబానికి ఇద్దరికి పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజక వర్గాల్లో ప్రోటోకాల్స్ ఎందుకు పాటించడం లేదని నిలదీశారు. కళ్యాణలక్ష్మి చెక్కులను తమకు తెలియకుండా పంపిణీ చేస్తున్నారన్నారు. చెక్కులను ఎమ్మెల్యేకు ఇవ్వవద్దని మంత్రి ఎమ్మార్వోలకు ఆదేశాలు ఇస్తున్నారన్నారు. అధికారులు ప్రోటోకాల్ ప్రకారం చెక్కులు పంచకపోతే హై కోర్టుకు వెళ్తానని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వెనక్కి తగ్గొద్దు ఎవరైనాసరే కూల్చేయండి..
ఏపీలో భారీ వర్షాలు.. అధికారుల హెచ్చరిక..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Sep 05 , 2024 | 12:06 PM