ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Prajahita Yatra: బండి సంజయ్ ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తత.. భారీగా మోహరించిన పోలీసులు..

ABN, Publish Date - Feb 27 , 2024 | 09:42 AM

Bandi Sanjay Prajahita Yatra: బీజేపీ నేత బండి సంజయ్ చేపట్టిన ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రజాహిత యాత్ర సిద్దిపేట(Siddipet) చేరుకోగా.. అక్కడ కాంగ్రెస్(Congress) శ్రేణులకు, బీజేపీ(BJP) శ్రేణులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ప్రజాహిత యాత్రపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి యత్నించారు. ప్రజాహిత యాత్రను అడ్డుకుంటామంటూ కాంగ్రెస్ శ్రేణులు వచ్చారు.

Prajahita Yatra

హుస్నాబాద్, ఫిబ్రవరి 27: బీజేపీ నేత బండి సంజయ్ చేపట్టిన ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రజాహిత యాత్ర సిద్దిపేట(Siddipet) చేరుకోగా.. అక్కడ కాంగ్రెస్(Congress) శ్రేణులకు, బీజేపీ(BJP) శ్రేణులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ప్రజాహిత యాత్రపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి యత్నించారు. ప్రజాహిత యాత్రను అడ్డుకుంటామంటూ కాంగ్రెస్ శ్రేణులు వచ్చారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు.. భారీగా మోహరించారు. కాంగ్రెస్ నాయకులు ప్రజాహిత యాత్ర క్యాంపు వైపు రాకుండా నిలువరించారు. బీజేపీ నేతలను సైతం ప్రజాహిత యాత్రకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు పోలీసులు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి బీజేపీ నేతలు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు పోలీసులు. బీజేపీ రాష్ట్ర నాయకులు, హుస్నాబాద్ బీజేపీ అభ్యర్ధి బొమ్మ శ్రీరాం చక్రవర్తిని ప్రజాహిత యాత్ర క్యాంపునకు వెళ్లకుండా నిలువరించారు. తమ పార్టీ నాయకుడిని తాము కలిసేందుకు వెళుతుంటే.. అడ్డుకోవడమేంటని పోలీసుల తీరుపై బొమ్మ శ్రీరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలను కూడా ప్రజాహిత క్యాంపువైపు వెళ్లనిచ్చేది లేదని పోలీసులు తేల్చి చెప్పారు.

కాంగ్రెస్ నేతలపై బండి ఆగ్రహం..

ప్రజాహిత యాత్రపై దాడి చేయాలని చూస్తున్న కాంగ్రెస్ శ్రేణులపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాహిత యాత్రను అడ్డుకోవాలని చూస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. మరోవైపు ప్రజాహిత యాత్రకు అడ్డంకులు సృష్టిస్తున్నారని తెలియడంతో అప్రమత్తమైన బీజేపీ శ్రేణులు.. బండి సంజయ్‌కు మద్దతుగా యాత్ర వద్దకు భారీగా తరలివస్తున్నారు. ఇదిలాఉంటే.. హుస్నాబాద్ నియోజకవర్గం బొమ్మెనపల్లి నుండి రెండోరోజు ప్రజాహిత యాత్రకు బండి సంజయ్ సిద్ధమయ్యారు. దీంతో హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Feb 27 , 2024 | 09:42 AM

Advertising
Advertising