Share News

K. Kavitha: ప్రజలను అవమానించేలా తెలంగాణ తల్లి విగ్రహంపై జీవో

ABN , Publish Date - Dec 14 , 2024 | 04:46 AM

తెలంగాణ తల్లి విగ్రహం రూపాన్ని ఇష్టం వచ్చినట్లు మార్చడమే కాకుండా.. ఎవరైనా ఇదే విగ్రహం పెట్టాలి.. లేదంటే కేసులు పెడతాం అంటూ రేవంత్‌ రెడ్డి సర్కార్‌ రాష్ట్ర ప్రజలను అవమానించేలా జీవో తెచ్చిందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు.

K. Kavitha: ప్రజలను అవమానించేలా తెలంగాణ తల్లి విగ్రహంపై జీవో

  • వేలసంఖ్యలో ఉద్యమస్ఫూర్తి విగ్రహాలను ఆవిష్కరిస్తాం

  • బతుకమ్మను అవమానించిన వారికి సీఎం ఏ శిక్షవేస్తారు?: కవిత

హైదరాబాద్‌, డిసెంబరు13 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ తల్లి విగ్రహం రూపాన్ని ఇష్టం వచ్చినట్లు మార్చడమే కాకుండా.. ఎవరైనా ఇదే విగ్రహం పెట్టాలి.. లేదంటే కేసులు పెడతాం అంటూ రేవంత్‌ రెడ్డి సర్కార్‌ రాష్ట్ర ప్రజలను అవమానించేలా జీవో తెచ్చిందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. గెజిట్‌ ఇవ్వడం వెనుక ఉద్దేశం ఏమిటని, అసలు తెలంగాణ తల్లి రూపాన్ని ఎలా మారుస్తారని ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వం ఎన్ని జీవోలిచ్చినా.. ఉద్యమస్ఫూర్తితో గతప్రభుత్వం రూపొందించిన విగ్రహాన్ని ఊరూరా ఊరేగించి.. నిలుపుకొంటామన్నారు.


తెలంగాణ జాగృతి, బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపడతామని, వేలసంఖ్యలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించుకుంటామన్నారు. ఆడబిడ్డలకు ఆత్మగౌరవమైన బతుకమ్మను అవమానిస్తూ.. కించపరిచి మాట్లాడిన మంత్రులు, కాంగ్రెస్‌ నాయకులకు ఏశిక్ష వేస్తారో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పాలని కవిత డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణ తల్లి రూపం మార్చడం, అధికారిక వేడుకల్లో విష సంస్కృతిని ప్రవేశ పెట్టడం వంటి అంశాలపై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో నేడు రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించనున్నట్లు కవిత తెలిపారు.

Updated Date - Dec 14 , 2024 | 04:46 AM