ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mahesh Kumar Goud: సమర్థులకే పదవులు!

ABN, Publish Date - Oct 26 , 2024 | 03:29 AM

కాంగ్రెస్‌ కోసం కష్టపడి పనిచేసే సమర్థులకే పార్టీ పదవులు కట్టబెట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ సూచించారు.

  • పనిచేసేవారికే అవకాశమివ్వండి

  • టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌తో కేసీ వేణుగోపాల్‌

న్యూఢిల్లీ, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ కోసం కష్టపడి పనిచేసే సమర్థులకే పార్టీ పదవులు కట్టబెట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ సూచించారు. పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలని అన్నారు. శుక్రవారం ఢిల్లీలో కేసీ వేణుగోపాల్‌ను మహేశ్‌కుమార్‌ గౌడ్‌ కుటుంబ సమేతంగా వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతం, నూతన కమిటీల నియామకం, రాజకీయ పరిస్థితులపై 40 నిమిషాలకు పైగా చర్చించారు. టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి 50 రోజులైన సందర్భంగా.. తాను నిర్వహించిన కార్యక్రమాలు, రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మహేశ్‌కుమార్‌గౌడ్‌ వివరించారు. ప్రతిపక్షాలు అడ్డగోలుగా చేస్తున్న ఆరోపణల్ని తిప్పికొడుతూ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళుతున్నామని, సోషల్‌ మీడియాను మరింత ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.


కాంగ్రెస్‌ ప్రభుత్వంతోపాటు పార్టీ కార్యక్రమాలను ప్రజలకు వివరించేలా యువతకు పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నామని, తద్వారా గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తున్నామని తెలిపారు. నామినేటెడ్‌ పోస్టుల నియామకంలో.. పార్టీ కోసం పనిచేసిన వారికి తగిన ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. కాగా, రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలోనూ జిల్లా కాంగ్రెస్‌ కమిటీ (డీసీసీ) కార్యాలయాల నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నామని కేసీ వేణుగోపాల్‌కు మహేశ్‌కుమార్‌గౌడ్‌ చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఉండే ప్రాంతంలో 2వేల గజాల విస్తీర్ణం కలిగిన స్థలంలో కార్యాలయాలు నిర్మించాలని టీపీసీసీ నిర్ణయించినట్లు తెలిపారు. ఇందుకోసం స్థలాలు కేటాయించాలని కోరుతూ కలెక్టర్లకు అధికారికంగా దరఖాస్తులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్ల పదవుల భర్తీపైనా చర్చించారు.

Updated Date - Oct 26 , 2024 | 03:29 AM