KCR: కుమార్తెను చూసి భావోద్వేగం!
ABN, Publish Date - Aug 30 , 2024 | 03:44 AM
చాన్నాళ్ల తర్వాత కూతురు కవితను చూసి బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు.
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కళ్లలో నీళ్లు..
ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కు కవిత
తండ్రితో ఆలింగనం.. పాదాభివందనం
ఆయనకు పాదాభివందనం
మర్కుక్, హైదరాబాద్, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): చాన్నాళ్ల తర్వాత కూతురు కవితను చూసి బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. ఆయన కళ్లలో నీళ్లు తిరిగాయి. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో బెయిల్ లభించడంతో ఐదున్నర నెలల జైలు జీవితం తర్వాత తిహాడ్ నుంచి విడుదలైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం తండ్రి కేసీఆర్‌ను కలిసేందుకు సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని ఫామ్‌హౌ్‌సకు వచ్చారు.
ఆమె వెంట భర్త అనిల్, కుమారుడు ఉన్నారు. ఫామ్‌హౌస్ వద్ద బీఆర్‌ఎస్ నేతలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. గుమ్మం ఎదుట గుమ్మడికాయతో దిష్టితీసి.. హారతులతో ఆమెను లోపలికి ఆహ్వానించారు. ఇంట్లోకి వస్తూనే కేసీఆర్‌కు కవిత పాదాభివందనం చేశారు. కుమార్తెను ఆశీర్వదించిన కేసీఆర్ ఆమెను ఆప్యాయంగా అక్కున చేర్చుకున్నారు.
ఈ సందర్భంగా తండ్రి చేతిని కవిత ముద్దాడారు. కవితకు బెయిల్ లభించడం పట్ల కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయం, కవిత అరెస్టు, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి ఒక్క సీటూ రాకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్న కేసీఆర్ ముఖంలో చాన్నాళ్ల తర్వాత సంతోషం ఉత్సాహం కనిపించాయని పలువురు బీఆర్‌ఎస్ నేతలు పేర్కొన్నారు.
Updated Date - Aug 30 , 2024 | 03:44 AM