ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Khammam: సర్కారీ బడుల్లో స్పోకెన్‌ ఇంగ్లిష్‌

ABN, Publish Date - Nov 28 , 2024 | 05:22 AM

ప్రభుత్వ పఠశాలల్లో చదువుకునే విద్యార్థులూ ఆంగ్ల భాషపై పట్టు సాధించేందుకు వీలుగా.. ‘స్పోకెన్‌ ఇంగ్లీష్‌’ తరగతులు నిర్వహించాలని ఖమ్మం జిల్లా విద్యాశాఖాధికారులు నిర్ణయించారు.

  • ఖమ్మం జిల్లాలో తొలివిడతగా 16 పాఠశాలల్లో ఆంగ్ల బోధన

  • రెండో దశలో 18 పాఠశాలల్లో..

  • పిల్లల్లో పెరుగుతున్న ప్రావీణ్యం

ఖమ్మం, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రభుత్వ పఠశాలల్లో చదువుకునే విద్యార్థులూ ఆంగ్ల భాషపై పట్టు సాధించేందుకు వీలుగా.. ‘స్పోకెన్‌ ఇంగ్లీష్‌’ తరగతులు నిర్వహించాలని ఖమ్మం జిల్లా విద్యాశాఖాధికారులు నిర్ణయించారు. సర్కారీ బడుల్లో ఇంగ్లిష్‌ కేవలం ఒక సబ్జెక్టుగా మాత్రమే ఉండడంతో.. విద్యార్థులు కేవలం పరీక్షల్లో రాయడానికి అవసరమైనంత మాత్రమే నేర్చుకుంటున్నారు. దీనివల్ల భాషపై వారికి పట్టు లేకుండా పోతోంది. ఉన్నత చదువులకు వెళ్లినప్పుడు వారికి అది అడ్డంకిగా మారుతోంది. తమకు తెలిసిన అరకొర ఆంగ్లంలో మాట్లాడలేక.. భయంతో చదువులో వెనకబడిపోతున్నారు. అందుకే ఈ పరిస్థితిని మార్చేందుకు ఖమ్మం జిల్లా విద్యా శాఖాధికారులు నడుం బిగించారు. సిలబ్‌సలోని సబ్జెక్టులతో పాటు స్పోకెన్‌ ఇంగ్లీ్‌షనూ ఒక సబ్జెక్టుగా పెట్టి బోధిస్తూ.. పిల్లలు ఆంగ్ల భాషలో ప్రావీణ్యం సంపాదించేలా ప్రణాళికలు రూపొందించారు. జిల్లాలోని మొత్తం 34 ప్రభుత్వ పాఠశాలలకుగాను తొలివిడతగా 16 బడుల్లో ఆగస్టు 14 నుంచి స్పోకెన్‌ ఇంగ్లిష్‌ తరగతులు ప్రారంభించారు. 6, 7, 8 తరగతుల విద్యార్థులకు నిత్యం సాయంత్రం పూట 45 నిమిషాలపాటు ఇంగ్లిష్‌ మాట్లాడడంలో తర్ఫీదు ఇస్తున్నారు. ఇందుకు.. గతంలో ప్రభుత్వం ఇచ్చిన డిజిటల్‌ టీవీలను వినియోగిస్తున్నారు ద్వారా విద్యార్థులకు ఆంగ్లం మాట్లాడడంలో తర్పీదు ఇస్తున్నారు.


కాగా.. ఈ పాఠాలు చెప్పడం కోసం విద్యా శాఖ అధికారులు ‘భారత్‌ దేఖో’ అనే ఎన్‌జీవోతో ఒప్పందం చేసుకుని ఆ సంస్థ ప్రతినిధులు పవిత్ర, అస్రా ద్వారా ముందుగా ఇంగ్లిష్‌ టీచర్లకు.. పిల్లలతో ఇంగ్లిష్‌ ఎలా మాట్లాడించాలి? వారిలో ఆంగ్లం పట్ల ఉన్న భయాన్ని ఎలా పోగొట్టాలి? అనే అంశాలపై ఆన్‌లైన్‌లో శిక్షణ ఇప్పించారు. ఇంగ్లిష్‌ కథలు, సన్నివేశాలు, కార్టూన్‌ షోలు, కొన్ని వీడియోలను కూడా ఆ ఎన్‌జీవో పంపించింది. ఈ శిక్షణతో విద్యార్థులు ఆంగ్లంలో మాట్లాడగలుగుతున్నారు. గతంలో ఉపాధ్యాయులు ఏదైన ప్రశ్న ఇంగ్లి్‌షలో అడిగినా.. సమాధానం తెలుగులోనే చెప్పే పిల్లలు, ఇప్పుడు ఆంగ్లంలోనే బదులిస్తున్నారు. ఈ శిక్షణ విజయవంతమైన నేపథ్యంలో.. రెండో దశలో మిగిలిన 18 పాఠశాలల్లోనూ స్పోకెన్‌ ఇంగ్లిష్‌ తరగతులు నిర్వహించనున్నట్టు జిల్లా విద్యా శాఖ అధికారి (డీఈవో) సోమశేఖర శర్మ తెలిపారు. కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌ చొరవతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు స్పోకెన్‌ ఇంగ్లిష్‌ తరగతులు నిర్వహించడం వల్ల.. విద్యార్థులు ఆంగ్లంలో చక్కగా మాట్లాడగలుగుతున్నారని ఆయన హర్షం వ్యక్తం చేశారు.


  • మార్పు చూసి మాకే ఆశ్చర్యం

గతంలో తరగతికి సంబంధించిన ఇంగ్లిష్‌ సబ్జెక్టును మాత్రమే బోధించేవారం. ఆంగ్లంలో మాట్లాడగలిగే నైపుణ్యం పిల్లలకు అంతగా ఉండేది కాదు. కానీ, ఇప్పుడీ స్పోకెన్‌ ఇంగ్లిష్‌ తరగతులతో విద్యార్థులు ఆంగ్లంలో మాట్లాడుకుంటున్నారు. ఇంగ్లి్‌షలో చర్చలు, ఇంటరాక్షన్‌ ప్రోగ్రాములు నిర్వహిస్తున్నాం. ఈ శిక్షణతో పిల్లల్లో వస్తున్న మార్పు చూసి మాకే ఆశ్చర్యం వేస్తోంది.

- గౌతమి, ఇంగ్లిష్‌ టీచర్‌, మామిళ్లగూడెం ప్రభుత్వ పాఠశాల


  • ఇంగ్లిష్‌ అంటే భయం పోయింది

నాకు నాన్న లేడు. అమ్మ ఇళ్లల్లో పనులు చేస్తూ నన్ను చదివిస్తోంది. ఇన్నాళ్లుగా నాకు ఇంగ్లిష్‌ అంటే భయంగా ఉండేది. స్పోకెన్‌ ఇంగ్లిష్‌ తరగతులతో నేను ఆంగ్లంలో మాట్లాడడం బాగా నేర్చుకున్నా. ప్రైవేటు పాఠశాలల్లో చదివే కొందరు నా స్నేహితులు ఇంగ్లిష్‌ మాట్లాడుతుంటే వారు గొప్పగా చదువుతున్నారని భావించేవాడిని. ఇప్పుడు నేను కూడా మాట్లాడగలగడం ఆనందంగా ఉంది.

- ప్రశాంత్‌, 7వతరగతి విద్యార్థి


  • ఇప్పుడు అందరితో ఇంగ్లి్‌షలో మాట్లాడుతున్నా

నేను మామిళ్లగూడెం ప్రభుత్వ పాఠశాలలో 7వతరగతి చదువుతున్నా. ఇక్కడ స్పోకెన్‌ ఇంగ్లిష్‌ ప్రత్యేకంగా చెబుతున్నందున నేను కూడా ఆంగ్లంలో మాట్లాడగలుగుతున్నా. ఇంతకుముందు పుస్తకంలో చూసి చదవడం తప్ప సొంతంగా మాట్లాడలేకపోయేదాన్ని. ఇప్పుడు క్లాసులో తోటి విద్యార్థులతోనే కాదు.. వేదికపైన కూడా నిర్భయంగా ఇంగ్లి్‌షలో మాట్లాడగలుగుతున్నా.

- పూజిత, 7వ తరగతి విద్యార్థి

Updated Date - Nov 28 , 2024 | 05:22 AM