ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Khammam: ఉన్నత చదువుకు వెళ్తే.. ప్రాణమే పోయింది

ABN, Publish Date - Dec 01 , 2024 | 04:40 AM

అమెరికాలోని ఓ షాపింగ్‌ మాల్‌లో దుండగులు జరిగిన కాల్పుల్లో ఖమ్మం యువకుడు మృతి చెందాడు. ఉన్నత చదువు కోసం ఐదు నెలల క్రితమే విదేశానికి వెళ్లిన కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

  • అమెరికాలో దుండగుల కాల్పులు.. ఖమ్మం విద్యార్థి మృతి

  • ఎంబీఏ కోసం ఐదు నెలల క్రితమే విదేశానికి సాయితేజ

ఖమ్మం క్రైం, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): అమెరికాలోని ఓ షాపింగ్‌ మాల్‌లో దుండగులు జరిగిన కాల్పుల్లో ఖమ్మం యువకుడు మృతి చెందాడు. ఉన్నత చదువు కోసం ఐదు నెలల క్రితమే విదేశానికి వెళ్లిన కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మంలోని 60వ డివిజన్‌ రామన్నపేటకు చెందిన నుకారపు కోటేశ్వరరావు, వాణి దంపతులు పట్టణంలోని రాపర్తినగర్‌లో నివాసం ఉంటున్నారు. వారి కుమారుడు సాయితేజ(22) ఖమ్మంలో బీటెక్‌ పూర్తి చేశాడు. అమెరికాలో ఎంబీఏ చదివేందుకు జూన్‌ 23న వెళ్లాడు. విస్కాన్సిన్‌ రాష్ట్రంలో ఇద్దరు స్నేహితులతో కలిసి ఉంటూ కాన్కర్డియా యూనివర్సిటీలో ఎంబీఏ చదువుతున్నాడు.


ఆర్థిక అవసరాల కోసం సమీపంలోని షాపింగ్‌మాల్‌లో స్టోర్‌ మేనేజర్‌గా పార్ట్‌ టైం ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి ఇద్దరు దుండగులు డబ్బు కోసం మాల్‌లో కాల్పులు జరిపారు. కౌంటర్‌లో డబ్బులను కాజేసి, సాయితేజ జేబులోని పైసలు కూడా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీంతో సాయితేజ డబ్బులు ఇచ్చేశాడు. అంతటితో ఆగక దుండగులు అతడిపై కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, సాయితేజ మృతిపై విదేశాంగ మంత్రి జైశంకర్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని షికాగోలోని భారత కాన్సులేట్‌ జనరల్‌ డిమాండ్‌ చేశారు. సాయితేజ మృతదేహాన్ని ఖమ్మం పంపిచేందుకు తానా ప్రతినిధులు కృషి చేస్తున్నారు. కాగా, కోటేశ్వరరావు కుమార్తె స్ఫూర్తి ప్రియ న్యూజెర్సీలో చదువు పూర్తి చేసి ఉద్యోగం చేస్తోంది.

Updated Date - Dec 01 , 2024 | 04:40 AM