ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mulugu Dist., గిరిజనుల కోసం వైద్యాధికారి చేసిన సాహసం

ABN, Publish Date - Jul 18 , 2024 | 01:15 PM

ములుగు జిల్లా: డీఎంహెచ్‌వో డా. అప్పయ్య తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఆదివాసులకు వైద్యం అందించారు. కొండ కోణల్లో ఉండే గిరి పుత్రులు జ్వరాలతో బాధ పడుతూ మెరుగైన వైద్యానికి నోచుకోక.. వారు బయటకు రాలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకున్న జిల్లా వైద్యాధికారి అప్పయ్య నేరుగా తానే ఆదివాసుల దగ్గరకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

ములుగు జిల్లా: డీఎంహెచ్‌వో (DMHO) డా. అప్పయ్య (Dr. Appayya) తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఆదివాసులకు (Tribals) వైద్యం (Medicine)అందించారు. కొండ కోణల్లో ఉండే గిరి పుత్రులు జ్వరాలతో బాధ పడుతూ మెరుగైన వైద్యానికి నోచుకోక.. వారు బయటకు రాలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకున్న జిల్లా వైద్యాధికారి అప్పయ్య నేరుగా తానే ఆదివాసుల దగ్గరకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తన వైద్య బృందంతో కలిసి ములుగు జిల్లా, వాజేడు మండలంలోని పెనుగోలుకు బయలుదేరి మార్గ మధ్యలో వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా ఓ పెద్ద వాగును సయితం ధైర్యంగా దాటారు.


మంగళవారం ఇంటి నుంచి బయలుదేరిన డాక్టర్ అప్పయ్య దట్టమైన అడవిలో 16 కి.మీ. నడిచారు. ఈ క్రమంలో అడ్డు వచ్చిన వాగులు, వంకలు దాటుకుంటూ సాహసంతో ముందుకు వెళ్లారు. సాయంత్రానికి గ్రామానికి చేరుకుని, గిరిజనుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని వారికి మందులు అందించారు. జ్వరం భారిన పలువురికి వైద్య పరీక్షలు చేశారు. రాత్రి తిరిగి వచ్చే అవకాశం లేకపోవడంతో అక్కడే గిరిజనులతో కలిసి బస చేశారు. తిరిగి మరుసటి రోజు బుధవారం ఇంటికి చేరుకున్నారు. స్వయాన ఆదివాసి అయిన అప్పయ్య వారి సమస్యలను తెలుసుకుని అక్కడికి నేరుగా వెళ్లి వైద్య సేవలు అందించడాన్ని అందరూ అభినందిస్తున్నారు.


ఇది ఒక పెద్ద సాహసమేనని చెప్పుకోవాలి. డా. అప్పయ్య తన ప్రాణాలను పణంగా పెట్టి గిరిజనులకు వైద్యం అందించాలనే తపనతో 16 కి.మీ. అడవిలో నడుచుకుంటూ గుట్టలు ఎక్కి దిగుతూ.. వాగులు దాటుకుని పెనుగోలు ఆదివాసి గూడెంకు వెళ్లారు. ఆ గూడెంకు వేసవి కాలం మాత్రమే నడక దారి ఉంటుంది. వర్షాకాలం అయితే ఆ గ్రామం చుట్టూ వాగులు.. వంకలే ఉంటాయి. దీంతో ఆదివాసీలు కిందికి రాలేని పరిస్థితి. వాళ్లు అడవిలో దొరికే దుంపలు, గడ్డలు తింటూ జీవనం సాగిస్తుంటారు. వారికి సీజనల్ వ్యాధులు వస్తున్న నేపథ్యంలో.. ఈ విషయం తెలుసుకున్న డా. అప్పయ్య తన వైద్య బృందంతో గూడెంకు వెళ్లి వారికి వైద్య సేవలు అందించారు. బాహ్య ప్రపంచానికి అందుబాటులో లేని గిరిజనులకు వైద్య సేవలు అందించడంతో సర్వత్రా అభినందులు వెల్లువెత్తుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

పోలీసులకు రాజ్ తరుణ్ వివరణ

ప్రజావాణిపై ప్రభుత్వం కీలక నిర్ణయం..

జగన్ మార్క్ కొత్త దందా..

శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల నేడు..

మాట నిలబెట్టుకున్న మంత్రి లోకేష్..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 18 , 2024 | 01:15 PM

Advertising
Advertising
<