ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG News: ఖమ్మంలో కేంద్ర బృందం పర్యటన

ABN, Publish Date - Sep 12 , 2024 | 11:54 AM

Telangana: ఖమ్మం నగరంలో కేంద్ర బృందం గురువారం ఉదయం పర్యటిస్తోంది. బొక్కల గడ్డ, జలగం నగర్, మోతీ నగర్, ప్రకాష్ నగర్, దంసలాపురం ప్రాంతాలలో కేంద్ర బృందం పర్యటించింది. మున్నేరు వరద కారణంగా నష్టపోయిన ఇళ్లను బృందం సభ్యులు పరిశీలించారు.

Khammam Flood

ఖమ్మం, సెప్టెంబర్ 12: ఖమ్మం (Khammam) నగరంలో కేంద్ర బృందం గురువారం ఉదయం పర్యటిస్తోంది. బొక్కల గడ్డ, జలగం నగర్, మోతీ నగర్, ప్రకాష్ నగర్, దంసలాపురం ప్రాంతాలలో కేంద్ర బృందం పర్యటించింది. మున్నేరు వరద కారణంగా నష్టపోయిన ఇళ్లను బృందం సభ్యులు పరిశీలించారు. రెండు బృందాలుగా మున్నేరు వరద ప్రాంతాలను కేంద్ర బృందం సభ్యులు పరిశీలించారు.

MLA Kaushik Reddy: కౌశిక్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం..



నష్టపోయిన వరద బాధితులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన కుటుంబాలకు అండగా ఉంటామని కేంద్ర బృందం హామీ ఇచ్చింది. జలగం నగర్ నుంచి కోదాడ కేంద్ర బృందం బయలుదేరింది. కేంద్ర బృందానికి వరదనష్టం వివరాలను జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్, నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్య తెలియజేశారు.


ఖమ్మం జిల్లాలో మున్నేరు వరద బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దాదాపు పదిరోజుల పాటు జిల్లా ప్రజలను మున్నేరు వణికించింది. గ్రామాలకు గ్రామాలు వరద నీటిలోని ఉండిపోయాయి. వెంటనే ముంపు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ప్రభుత్వం ముమ్మరం చేసింది. మున్నేరు వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారికి ఆహారం, తాగునీరు, వైద్యసాయాన్ని అందించారు. వరద ముంపు ప్రాంతాల్లో అధికార, ప్రతిపక్ష నేతలు పర్యటించి అక్కడి పరిస్థితిని తెలుసుకున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ముంపు ప్రాంతాల్లో పర్యటించారు.

YSRCP: వైసీపీలో ఉండలేమంటున్న నాయకులు.. అధ్యక్షుడి వైఖరిపై అసంతృప్తి


అయితే వరద ముంపు తగ్గాక ఇంటికి వెళ్లిన బాధితులు అక్కడ పరిస్థితి చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. వరద ధాటికి కొట్టుకుపోయిన ఇళ్లను చూసి రోదించారు. మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు దయనీయ స్థితిలో ఉన్నారు. వేలాది మంది ప్రజలు సర్వం కోల్పోయి నడి వీధిలో నిలబడ్డారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని మున్నేరు వరద ముంపు బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

Harish Rao: గురుకులాల్లో విద్యార్థులకు పాము కాట్లపై హరీష్ ఫైర్

KTR: ఇంకెంతమంది రైతుల ప్రాణాలు బలిపెట్టాలి?

Read LatestTelangana NewsAndTelugu News

Updated Date - Sep 12 , 2024 | 12:26 PM

Advertising
Advertising