Congress: ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
ABN, Publish Date - Mar 11 , 2024 | 03:08 PM
Telangana: భద్రాచలంలో ‘‘ఇందిరమ్మ ఇళ్లు’’ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రాముల వారు కొలువైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలంలో ఈ పథకానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఇందిరమ్మ ఇళ్లు ఐదోది. అధికారంలోకి వచ్చాక మూడు నెలల్లో నాలుగు పథకాలను అమలు చేసిన రేవంత్ సర్కార్.. తాజాగా ఐదో పథకమైన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కూడా కార్యరూపం దాల్చింది.
భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 11: భద్రాచలంలో ‘‘ఇందిరమ్మ ఇళ్లు’’ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రారంభించారు. రాముల వారు కొలువైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలంలో ఈ పథకానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఇందిరమ్మ ఇళ్లు ఐదోది. అధికారంలోకి వచ్చాక మూడు నెలల్లో నాలుగు పథకాలను అమలు చేసిన రేవంత్ సర్కార్.. తాజాగా ఐదో పథకమైన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కూడా కార్యరూపం దాల్చింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka), మంత్రులు తుమ్మల (Tummala Nageshwarao), పొంగులేటి (Ponguleti Srinivas), కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkatreddy), ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy), సీతక్క (Seethakka), కొండా సురేఖ (Konda Surekhha), శ్రీధర్ బాబు (sridhar Babu), పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar)పాల్గొన్నారు. అలాగే ఎమ్మెల్యేలు కూనంనేని, తెల్లం వెంకట్రావ్, కోరం కనకయ్య, రాగమయి, జారే ఆదినారాయణ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి....
Balka Suman: దేవుడి సాక్షిగా డిప్యూటీ సీఎంకు ఇంతటి అవమానమా..!
Big Breaking: బీజేపీలోకి వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే..!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - Mar 11 , 2024 | 04:10 PM