Bhadrachalam: భద్రాద్రి రామయ్య భక్తులకు శుభవార్త..
ABN, Publish Date - Mar 19 , 2024 | 08:59 AM
Bhadradri: భద్రాద్రి రామాలయం(Bhadrachalam Temple) అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. స్థానిక భక్తులను(Devotees) దృష్టిలో ఉంచుకుని ఉచిత దర్శనం(Free Darshan) అవకాశం కల్పించారు. ఈ నిర్ణయం మంగళవారం నుంచే అమల్లోకి రానుంది. అధికారుల నిర్ణయం ప్రకారం.. భద్రాచలం స్థానికులు తమ గుర్తింపు కార్డును చూపి..
Bhadradri: భద్రాద్రి రామాలయం(Bhadrachalam Temple) అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. స్థానిక భక్తులను(Devotees) దృష్టిలో ఉంచుకుని ఉచిత దర్శనం(Free Darshan) అవకాశం కల్పించారు. ఈ నిర్ణయం మంగళవారం నుంచే అమల్లోకి రానుంది. అధికారుల నిర్ణయం ప్రకారం.. భద్రాచలం స్థానికులు తమ గుర్తింపు కార్డును చూపి.. రూ. 100 క్యూలైన్లలో ఉచితంగా ప్రవేశించవచ్చు. తద్వారా రామయ్యను ఉచితంగా దర్శించుకోవచ్చు. అయితే, ఇక్కడ ఒక కండీషన్ ఉంది. ప్రతి మంగళవారం, బుధవారం, గురువారం రోజుల్లో సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు మాత్రమే ఈ ఉచిత దర్శనం అవకాశం ఉంటుంది. మిగతా సమయాల్లో యధావిధంగా ఉంటాయి. ఈ విషయాన్ని ఆలయ ఈవో రామాదేవి వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
Updated Date - Mar 19 , 2024 | 08:59 AM