TG News: పంట నష్టపోయిన రైతుల కోసం.. మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు
ABN, Publish Date - May 17 , 2024 | 09:54 PM
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) కీలక ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ సచివాలయంలోని తన ఛాంబర్‌లో వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. మార్కెంటింగ్,జౌలి, ఆహార శుద్ధి ఏర్పాట్లు, అకాల వర్షాలు, పంట నష్టాలపై మంత్రి సమీక్షించారు.
హైదరాబాద్: వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) కీలక ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ సచివాలయంలోని తన ఛాంబర్‌లో వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. మార్కెంటింగ్,జౌలి, ఆహార శుద్ధి ఏర్పాట్లు, అకాల వర్షాలు, పంట నష్టాలపై మంత్రి సమీక్షించారు. తెలంగాణకు తలమానికంగా నిలిచిన కోహెడ ఫ్రూట్ మార్కెట్ నుంచి అంతర్జాతీయంగా పండ్ల ఎగుమతులు జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ యార్డ్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునీకికరించాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. టెక్స్‌కో సంస్థ ద్వారా రాష్ట్రంలోని శానిటరీ, నాపికిన్‌ల తయారీ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. అకాల వర్షాలతో రైతులు పంట నష్టపోకుండా ఉండేందుకు ప్రతి జిల్లాలోనూ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి....
BJP MLAs: వడ్లు కొనుగోలులో సీఎం రేవంత్ సర్కార్ విఫలం..
Vijayashanti: కాంగ్రెస్‌లో ఉంటూనే బీఆర్‌ఎస్‌పై రాములమ్మ ఇంట్రెస్టింగ్ ట్వీట్...
Rakesh Reddy: బీఆర్ఎస్ అభ్యర్థిగా నేను ప్రశ్నించే గొంతును..
Read Latest Telangana News And Telugu News
Updated Date - May 17 , 2024 | 09:54 PM