ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG News: భద్రాద్రి పవర్‌ ప్లాంట్‌పై పిడుగుపాటు

ABN, Publish Date - Jun 29 , 2024 | 09:39 PM

భద్రాద్రి పవర్ ప్లాంట్ ఒకటో యూనిట్‌పై పిడుగు పడింది. పిడుగు పాటుకు 270 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి షట్ డౌన్ అయింది. జనరేషన్ ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు చెలరేగినట్లు ప్లాంట్ అధికారులు చెబుతున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి పవర్ ప్లాంట్ ఒకటో యూనిట్‌పై పిడుగు పడింది. పిడుగు పాటుకు 270 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి షట్ డౌన్ అయింది. జనరేషన్ ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు చెలరేగినట్లు ప్లాంట్ అధికారులు చెబుతున్నారు. ప్లాంట్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురాడానికి ప్రయత్నిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు కూడా సహాయక చర్యలు చేపట్టారు.


నష్టం భారీగా వాటిళ్లవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ సంఘటనలో ఎవరికైనా ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. విధుల్లో ఉన్న సిబ్బందిని ప్లాంట్ నుంచి దూరంగా పంపించి వేస్తున్నారు. ఈ ప్రమాదంతో స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు. కాగా..ఈ ప్రమాదంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరా తీశారు. బీటీపీఎస్సీఈ అధికారికి మంత్రి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.

Updated Date - Jun 29 , 2024 | 09:49 PM

Advertising
Advertising