Ponguleti: న్యాయమైన కోరికలు తీరుస్తా: మంత్రి పొంగులేటి
ABN, Publish Date - Jun 03 , 2024 | 12:06 PM
ఖమ్మం జిల్లా: పేదవారి ప్రభుత్వం వచ్చిన తరువాత రోహిణి కార్తెలోనే వర్షాలు కురుస్తున్నాయని, అనేక కష్టాలు, నష్టాలు పడి తనను మంచి మెజారిటీతో గెలిపించారని, మీరిచ్చిన అవకాశంతోనే తాను ఈస్థాయిలో ఉన్నానని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
ఖమ్మం జిల్లా: పేదవారి ప్రభుత్వం వచ్చిన తరువాత రోహిణి కార్తె (Rohini Karte)లోనే వర్షాలు (Rains) కురుస్తున్నాయని, అనేక కష్టాలు, నష్టాలు పడి తనను మంచి మెజారిటీతో గెలిపించారని, మీరిచ్చిన అవకాశంతోనే తాను ఈస్థాయిలో ఉన్నానని రెవెన్యూ శాఖ మంత్రి (Revenue Minister) పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) అన్నారు. సోమవారం ఆయన నేలకొండపల్లి మండలం, కొత్త కొత్తూరులో ప్రజల వద్దకే శ్రీనన్న కార్యక్రమంలో (Srinanna program) పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో (Parliament Elections) పాలేరు (Paleru) నుంచి అత్యధిక మెజారిటీ రాబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆనాడు ఎన్నికల సభలో ప్రజలు అడిగిన కోరికలు నెరవేరుస్తానని మాటిచ్చానని, మీరు అడిగిన న్యాయమైన కోరికలు తీరుస్తానని మంత్రి పొంగులేటి అన్నారు. రాబోయే ఏడాది లోపే పాలేరులోని అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. గడిచిన పదేళ్లలో పేదవారికి ఒక్క ఇళ్లు కూడా ఇవ్వలేదని, అర్హులైన వారికి ఆసరా పెన్షన్ కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదని విమర్శించారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తామని స్పష్టం చేశారు. రూ. ఇరవై రెండున్నర వేల కోట్లు ఖర్చు పెట్టి ఇందిరమ్మ ఇళ్ళు కట్టిస్తామన్నారు.
ప్రధాన ప్రతి పక్షం కల్లబొల్లి మాటలు మాట్లాడితుందని ఈ సందర్భంగా బీఆర్ఎస్‌పై మంత్రి పొంగులేటి నిప్పులు చెరిగారు. పేదవారిని విస్మరించిన బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు సీట్లు వచ్చే పరిస్థితి లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పోస్టల్ బ్యాలెట్‌పై నేడు సుప్రీం కోర్టులో విచారణ
సుప్రీం కోర్టును ఆశ్రయించిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
బానిసత్వాన్ని తెలంగాణ భరించదు:సీఎం
మరో బాదుడు మొదలుపెట్టిన జగన్..
అతిపెద్ద పార్టీగా అవతరించనున్న టీడీపీ..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jun 03 , 2024 | 12:08 PM