ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tummala: ఇరిగేషన్ అధికారులపై మంత్రి తుమ్మల ఆగ్రహం.. కారణమిదే!

ABN, Publish Date - Aug 07 , 2024 | 11:59 AM

Telangana: ఇరిగేషన్ అధికారులపై మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రామాలయం అన్నదాన సత్రం వద్ద వరద నీరు నిలవడంపై మండిపడ్డారు. మంత్రి ఆదేశాలను గోదావరి నది కరకట్ట స్లూయిజ్ లాక్‌లను ఎత్తి పట్టణంలోని వర్షపు నీటిని గోదావరిలోకి ఇరిగేషన్ అధికారులు విడుదల చేశారు. ఈ క్రమంలో ఉదయం నుంచి నీటిలో మునిగి వున్న రామాలయ ప్రాంతం వాసులకు ఉపశమనం కలిగనట్లైంది.

Minister Tummala Nageshwar Rao

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 7: ఇరిగేషన్ అధికారులపై మంత్రి తుమ్మల నాగేశ్వరావు (Minister Tummala Nageshwar rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. రామాలయం అన్నదాన సత్రం వద్ద వరద నీరు నిలవడంపై మండిపడ్డారు. మంత్రి ఆదేశాలను గోదావరి నది కరకట్ట స్లూయిజ్ లాక్‌లను ఎత్తి పట్టణంలోని వర్షపు నీటిని గోదావరిలోకి ఇరిగేషన్ అధికారులు విడుదల చేశారు. ఈ క్రమంలో ఉదయం నుంచి నీటిలో మునిగి వున్న రామాలయ ప్రాంతం వాసులకు ఉపశమనం కలిగనట్లైంది. కాగా.. గోదావరి నీటిమట్టం 33 అడుగులు ఉండటంతో లాక్‌లను అధికారులు ఎత్తివేశారు. మళ్లీ గోదావరి ప్రవాహం 36 అడుగులకు చేరితేనే లాకులను మూసివేయనున్నారు.

Bangladesh violence: హిందూవులను కాపాడండి.. సద్గురు జగ్గీ వాసుదేవన్ విజ్ఞప్తి


కాగా.. భద్రాచలంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంతో రామాలయం పరిసర ప్రాంతాల్లో వరద నీరు పోటెత్తింది. పట్టణంలోని వర్షపు నీరు డ్రైయినేజ్ నీరు మోటార్లతో ఎత్తిపోయక పోవడంతో వరద నీరు నిలిచిపోయింది. దేవస్థానం ఆలయం అన్నదాన సత్రంలోకి చేరిన వరద నీరు చేరింది. దీంతో అన్నదానం సత్రాన్ని మూసివేశారు. భక్తులకు పాకెట్‌ల ద్వారా అన్నదానానికి ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. గోదావరి నది కరకట్ట స్లూయిజ్‌ల నుండి వర్షపు నీటిని పంప్ చెయ్యకపోవడంతో నీట మునిగిన రామాలయ ప్రాంతం నీట మునిగింది. విషయం తెలిసిన మంత్రి తుమ్మల.. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో గోదావరి నది కరకట్ట స్లూయిజ్ లాక్‌లను ఎత్తి పట్టణంలోని వర్షపు నీటిని గోదావరిలోకి విడుదల చేయడంతో రామాలయ ప్రాంతం వాసులకు ఉపశమనం కలిగింది.

Viral Video: కిడ్నాప్ చేసిన కారు నుంచి ఎలా తప్పించుకోవాలో.. సింపుల్ ట్రిక్‌తో చెప్పేశాడుగా..


కూలడానికి సిద్ధంగా ఈశాన్య మండపం...

మరోవైపు.. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న శ్రీ కుసుమ హరినాథ్ బాబా మందిరంలో ఈశాన్య మండపానికి బీటలు వారాయి. భారీ వర్షాల కారణంగా ఈశాన్యం మండపం కూలడానికి సిద్ధంగా ఉంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మండప అడుగుభాగం పూర్తిగా దెబ్బతిన్నది. కింద భాగం పెచ్చులు ఊడి కింద పడటంతో తృటిలో భారీ ప్రమాదం తప్పింది. విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అక్కడకు చేరుకుని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మండపాన్ని పూర్తిగా తీసివేసి పరిస్థితి చక్కదిద్దాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఎటువంటి ప్రమాదం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు జిల్లా కలెక్టర్ పాటిల్ ఆదేశాలు జారీ చేసింది.


ఇవి కూడా చదవండి...

Pawan Kalyan: సమస్యలపై డిప్యూటీ సీఎంకు మెురపెట్టుకున్న ఏపీ క్యాబ్ డ్రైవర్లు..

KTR: చేనేత కార్మికులకు హృదయపూర్వక శుభాకాంక్షలు..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 07 , 2024 | 12:02 PM

Advertising
Advertising
<