ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tummala: సీఎం రేవంత్ సభను విజయవంతం చేయాలి

ABN, Publish Date - Aug 13 , 2024 | 01:07 PM

Telangana: ఖమ్మం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి వైరా బహిరంగ సభ సన్నాహక సమావేశంలో మంత్రి తుమ్మల మీడియాతో మాట్లాడుతూ... గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం చేయాలనే సీతారామ ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేశామన్నారు. గత ప్రభుత్వం 8 వేల కోట్లతో నిర్మించిన సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ మోటార్లు పాడవకుండా సద్వినియోగం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

Minister Tummala Nageshwar Rao

ఖమ్మం, ఆగస్టు 13: ఖమ్మం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి వైరా బహిరంగ సభ సన్నాహక సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageshwar Rao) మీడియాతో మాట్లాడుతూ... గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం చేయాలనే సీతారామ ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేశామన్నారు. గత ప్రభుత్వం 8 వేల కోట్లతో నిర్మించిన సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ మోటార్లు పాడవకుండా సద్వినియోగం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

Rajiv Arrest: జోగీ రమేష్ కుమారుడు రాజీవ్‌ అరెస్ట్..


ఆగస్ట్ 15న వైరాలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ విజయవంతం చేయాలన్నారు. రైతాంగం తలరాత మార్చే సభగా వైరా సభ నిలవనుందని చెప్పుకొచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ఖమ్మం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. ‘‘నా జీవిత కోరిక సీతారామతో తీరింది’’ అని అన్నారు. దక్షిణ అయోధ్యకు రైల్వేలైన్ రాబోతుందని.. త్వరలో కొత్తగూడెం విమానాశ్రయం రాబోతుందని వెల్లడించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధి చేస్తామన్నారు. కాంగ్రెస్ పాలనలోనే భద్రాచలం అభివృద్ధి పూర్తి స్థాయిలో చేస్తామన్నారు.

Doctors Protest: భద్రత లేకుండా.. డ్యూటీ చేయం.. వైద్యుల నిరసనలతో దేశవ్యాప్తంగా ఓపీడీ సేవల్లో అంతరాయం



రాజకీయ అసూయతో చేసే విమర్శలను తాను పట్టించుకోనని స్పష్టం చేశారు. రాజకీయ వేధింపులు అరాచకం తన జీవితంలో లేవన్నారు. రాజకీయ విరోధులైన జలగం వెంగళరావు, రజబ్ అలీ ఇతర నేతలను వ్యక్తిగతంగా విమర్శ చేయలేదన్నారు. తాను చేసిన అభివృద్ధి పనులు పార్టీలకతీతంగా స్వాగతిస్తున్నారన్నారు. పదవులు శాశ్వతం కాదని... చేసిన పనులే చరిత్రలో నిలుస్తాయన్నారు. ప్రజల కోసం పనిచేసే నాయకులు ఏ పార్టీలో ఉన్నా అభిమానిస్తాం తప్ప వ్యక్తిగత విమర్శలు చేయనని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

Stock Market: స్వల్ప నష్టాల్లో సూచీలు.. అప్రమత్తంగా నిఫ్టీ, సెన్సెక్స్..!

TG News: కోటగల్లి ఎస్సీ గర్ల్స్ హాస్టల్‌లో ఏసీబీ సోదాలు.. కారణమిదే!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 13 , 2024 | 01:15 PM

Advertising
Advertising
<