ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సీతారామ ప్రాజెక్టును 2026కల్లా పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్ కుమార్

ABN, Publish Date - Aug 15 , 2024 | 03:55 PM

సీతారామ ప్రాజెక్టును ఆగస్టు 15, 2026నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గోదావరి పరీవాహక ప్రాంతం నుంచి కృష్ణా పరీవాహక ప్రాంతానికి నీళ్లు తరలించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని వారు ఉద్ఘాటించారు. ప్రాజెక్టు మూడు పంప్ హౌస్‌లు ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రులు మీడియాతో మాట్లాడారు.

భద్రాద్రి కొత్తగూడెం: సీతారామ ప్రాజెక్టును ఆగస్టు 15, 2026నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గోదావరి పరీవాహక ప్రాంతం నుంచి కృష్ణా పరీవాహక ప్రాంతానికి నీళ్లు తరలించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని వారు ఉద్ఘాటించారు. ప్రాజెక్టు మూడు పంప్ హౌస్‌లు ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రులు మీడియాతో మాట్లాడారు.


ఇవాళ (గురువారం) సీతారామ ప్రాజెక్టు మూడు పంప్ హౌస్‌లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భట్టి విక్రమార్క ప్రారంభించారు. మొదటి పంప్‌హౌస్‌ను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రారంభించగా, ములకలపల్లి మండలం కమలాపురం వద్ద మూడో పంప్‌ హౌస్‌ను మంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు. అలాగే పూసుగూడెంలో సీతారామ ప్రాజెక్టు రెండో పంప్‌ హౌస్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్విచ్ ఆన్ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సహా కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు పెద్దఎత్తున పాల్గొన్నారు.


ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. "గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీతారామ ప్రాజెక్టు డీపీఆర్ చూస్తే 39శాతం పనులు మాత్రమే చేసినట్లు తెలుస్తోంది. కమీషన్లకు కక్కుర్తి పడి ప్రాజెక్టుకు మోటార్లు పెట్టారు. గత ప్రభుత్వం కుక్క గోతులు తవ్వింది తప్ప డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ తవ్వలేదు. 80వేల పుస్తకాలు చదివిన కేసీఆర్‌కు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో రిజర్వాయర్ నిర్మించడం తెలియలేదు. స్వయంగా రోళ్లపాడు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన మాజీ సీఎం కేసీఆర్ దాన్ని కనీసం పట్టించుకోలేదు" అని అన్నారు.


సీతారామ ప్రాజెక్టుకు 67 టీఎంసీల హైడ్రాలజీ క్లియరెన్స్ తెచ్చిన ఘటన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సీడబ్ల్యూసీ అప్రూవల్ మరో పది రోజుల్లో రానున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రాజెక్టు మూడు పంప్ హౌస్‌లు ప్రారంభించామని, ఆగస్టు 15, 2026నాటికి సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం రూ.1.81లక్షల కోట్లు ఖర్చు పెట్టి కూడా సాగునీళ్లు ఇవ్వడంలో విఫలం అయ్యిందని ఆయన మండిపడ్డారు. నాగార్జున సాగర్ నీళ్లు రాని సమయంలో రాజీవ్ కెనాల్ ద్వారా గోదావరి నీళ్లతో ఆయకట్టు స్థిరీకరణ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు.

Updated Date - Aug 15 , 2024 | 03:55 PM

Advertising
Advertising
<