ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Crime News: రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ కలకలం..

ABN, Publish Date - Jun 03 , 2024 | 08:50 PM

మణుగూరు(Manuguru)లో భారీగా గంజాయి(Ganja) పట్టుపడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డొంకరాయి (Donkarayi) నుంచి మణుగూరు మీదుగా మామిడికాయల మాటున ట్రాలీలో హైదరాబాద్‌కు తరలిస్తుండగా 477కేజీలను స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.1.19కోట్లు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.

భద్రాద్రి కొత్తగూడెం: మణుగూరు(Manuguru)లో భారీగా గంజాయి(Ganja) పట్టుపడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డొంకరాయి(Donkarayi) నుంచి మణుగూరు మీదుగా మామిడికాయల మాటున ట్రాలీలో హైదరాబాద్‌కు తరలిస్తుండగా 477కేజీలను స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.1.19కోట్లు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ఐదుగురిని అరెస్టు చేసి కారు, ట్రాలీని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు.


మరోవైపు బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకుని పలువురు తెలుగు నటీనటులు పట్టుపడిన సంగతి తెలిసిందే. నటి హేమతో సహా పార్టీలో పాల్గొన్న తెలుగువారందరికీ డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్‌గా తేలింది. దీంతో హేమను బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు హైదరాబాద్ కూకట్‌పల్లిలో డ్రగ్ పెడ్లర్ షేక్ ఫరూక్‌ను పట్టుకున్నారు. నిందితుడి వద్ద 4.1గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ పట్టుపడింది. బెంగుళూరు నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లుగా గుర్తించి అరెస్టు చేశారు.


హైదరాబాద్ నగరంలో డ్రగ్స్, గంజాయి వంటి మత్తుపదార్థాలు విపరీతంగా వాడుతున్నారంటూ వచ్చే ఆరోపణలకు ఈ ఘటనలు బలం చేకూర్చేలా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచీ యువత బతుకుదెరువుకు హైదరాబాద్ వస్తుంటారు. అయితే ఇలాంటి మత్తుపదార్థాల బారిన పడితే వారి పరిస్థితి ఏంటంటూ తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.

ఇది కూడా చదవండి:

Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసు ఛార్జ్ షీట్‌లో ఈడీ సంచలన విషయాలు వెల్లడి..

For more Telangana news and Telugu news..

Updated Date - Jun 03 , 2024 | 08:50 PM

Advertising
Advertising