Minister Thummala: ఓడిపోయిన 60 రోజులకే కేసీఆర్ అలా ఎందుకన్నారో..?
ABN, Publish Date - Feb 13 , 2024 | 10:08 PM
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నల్గొండ స్పీచ్‌పై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) రీ కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు విధ్వంసానికి మూల కారణం కేసీఆరే అని ఆరోపించారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నల్గొండ స్పీచ్‌పై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) రీ కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు విధ్వంసానికి మూల కారణం కేసీఆరే అని ఆరోపించారు. పాలిచ్చే బర్రెను వదులుకొని దున్నపోతుని తెచ్చుకున్నారని కేసీఆర్ అనడం ప్రజాస్వామ్యాన్ని, ప్రజల నిర్ణయాన్ని అపహస్యం చేయడమేనని మండిపడ్డారు. వేదిక మీద పెద్ద పెద్ద వ్యాఖ్యలు చేసే కేసీఆర్ ప్రజలచే ఎన్నికైన ప్రభుత్వం గురించి హేళనగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు.
ఒక మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ మాట్లాడే భాష, ప్రజాస్వామ్య విలువలకు లోబడి లేదన్నారు. ఓడిపోయిన 60 రోజులకే అధికారం గురించి ఇంత ఆరాటపడటంతో కేసీఆర్ ఆంతర్యం అర్థం చేసుకోవచ్చని తెలిపారు. వాస్తవాలను మరచి కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు దొంగే దొంగ అనట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. 2 నెలల వయస్సు కూడా లేని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పు పట్టే కేసీఆర్ తపనా, ఆరాటాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కేసీఆర్ ఆరోపణలను జనాలు నమ్మే పరిస్థితుల్లో లేరని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు.
Updated Date - Feb 13 , 2024 | 10:08 PM