Telangana: వినోబానగర్‌కు బుక్కెడు నీరు లేదే..!
ABN, Publish Date - May 30 , 2024 | 08:14 AM
జూలూరుపాడు మండలం వినోబానగర్ గ్రామంలో తాగునీటి విపరీతంగా ఉందని.. బుక్కెడు నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థలు ఆందోళనకు దిగారు.
భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణలో తాగు, సాగు నీరందగా రైతాంగం, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీటి నిర్వహణ సక్రమంగా చేయలేకపోతోందని బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోంది. సరైన సమయంలో సాగు నీరందక పంటలు ఎండిపోతున్నాయని దుమ్మెత్తి పోస్తున్నాయి. మిషన్ భగీరథను సైతం సమక్రంగా నిర్వహించకుండా ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాయని మండిపడుతున్నాయి.
తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇలాంటి పరిస్థితే నెలకొంది. జూలూరుపాడు మండలం వినోబానగర్ గ్రామంలో తాగునీటి విపరీతంగా ఉందని.. బుక్కెడు నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థలు ఆందోళనకు దిగారు. సాగునీరు అందికలేకపోతున్న ప్రభుత్వం కనీసం తాగు నీరయినా ఇవ్వలేదా? అంటూ ఖాళీ బిందెలతో ఖమ్మం- కొత్తగూడెం రహదారిపై గ్రామస్థులు నిరసనకు దిగారు. నెలలుగా నీటి కష్టాలతో జీవితాలు ఈడ్చుకోస్తున్నామని, గ్రామానికి నిరంతరం నీటి సౌకర్యం ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
ఇది కూడా చదవండి:
Crime news: బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన హోంగార్డు అరెస్టు
For more Telangana news and Telugu news..
Updated Date - May 30 , 2024 | 08:31 AM