ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలు దివాలా: కిషన్‌రెడ్డి

ABN, Publish Date - Nov 08 , 2024 | 02:53 AM

కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలు ఆర్థికంగా దివాలా తీశాయని, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జీ కిషన్‌రెడ్డి తెలిపారు.

  • ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి లేదు.. తెలంగాణలో సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత

  • ఏ హామీనీ నిలబెట్టుకోని ప్రభుత్వం

  • కుటుంబ పాలనకు బీజేపీ వ్యతిరేకం

  • ధాన్యం కొనుగోళ్లకు కేంద్రం అండ

  • బీజేపీ సంస్థాగత ఎన్నికల వర్క్‌షా్‌పలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలు ఆర్థికంగా దివాలా తీశాయని, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జీ కిషన్‌రెడ్డి తెలిపారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌.. ఆయా రాష్ట్రాల ప్రజలకు చుక్కలు చూపిస్తోందని విమర్శించారు. తెలంగాణలో ఏడాది తిరక్కుండానే రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. బీఆర్‌ఎస్‌ సర్కారు దోపిడీ విధానానికి వ్యతిరేకంగా ప్రజలు కాంగ్రె్‌సకు పట్టం కట్టబెడితే ఏ ఒక్క గ్యారెంటీని నిలబెట్టుకోలేక చతికిలబడిందని దుయ్యబట్టారు. పొయ్యి మీద నుంచి పెనంపై పడ్డట్టు తెలంగాణ ప్రజల పరిస్థితి ఉందన్నారు. బీజేపీ సంస్థాగత ఎన్నికలలో భాగంగా గురువారం నిర్వహించిన వర్క్‌షా్‌పలో కిషన్‌రెడ్డి ప్రసంగించారు. జమ్మూకశ్మీర్‌ నుంచి తమిళనాడు వరకూ పలు రాష్ట్రాల్లో కొడుకు, అల్లుడు, బిడ్డ అంటూ కుటుంబపార్టీల రాజకీయాలు కొనసాగుతున్నాయని.. దీనికి బీజేపీ పూర్తి వ్యతిరేకమని.. ఇందుకు బీజేపీ శ్రేణులు గర్వపడాలన్నారు. తెలంగాణలో కేసీఆర్‌ హయాంలో రూ.7 లక్షల కోట్ల అప్పులు చేస్తే.. కాంగ్రెస్‌ హయాంలో ఏ భూములను తాకట్టు పెట్టి అప్పు తీసుకోవాలా అని చూస్తున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు.


  • ధాన్యం కొనుగోళ్లకు కేంద్రం పూర్తి సహకారం

రాష్ట్రంలో 31 లక్షల సభ్యత్వ నమోదు పూర్తయిందన్నారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి చివరి గింజ వరకూ కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఎన్నివేల కోట్లయినా ఇచ్చేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధంగా ఉంటే ఇక్కడి ప్రభుత్వం మధ్యవర్తులు, మిల్లర్లు, దళారీలతో కుమ్మక్కై రైతులకు అన్యాయం చేస్తున్న పరిస్థితి ఉందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకింత బాధ్యతారాహితంగా వ్యవహరిస్తుందో అర్థం కావడం లేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి మాటలు కోటలు దాటుతాయే తప్ప పనులు మాత్రం కనిపించవని ఎద్దేవా చేశారు. ఇదే సందర్భంగా.. మీడియాతో చిట్‌చాట్‌లో కిషన్‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణాలో భవిష్యత్తు బీజేపీదేనని స్పష్టం చేశారు. బీజేపీ లేకుండా తెలంగాణ రాజకీయం ఉండబోదన్నారు. బీఆర్‌ఎస్‌ చరిత్ర ముగిసిపోయిందని, కాంగ్రెస్‌ పార్టీ పని అయిపోయిందని వ్యాఖ్యానించారు. మూసీ పరీవాహక ప్రాంతంలో త్వరలో పర్యటిస్తామని కిషన్‌రెడ్డి తెలిపారు.

  • ఒకే దేశం- ఒకే ఎన్నిక గొప్ప నిర్ణయం: లక్ష్మణ్‌

ఒకే దేశం-ఒకే ఎన్నిక... ప్రధాని మోదీ సాహసోపేత నిర్ణయమని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్‌ కె. లక్ష్మణ్‌ తెలిపారు. బీజేపీ వర్క్‌షాపులో ఆయన మాట్లాడుతూ.. దేశమంతా ఒకేసారి ఎన్నికల నిర్వహణకు మోదీ కృతనిశ్చయంతో ఉన్నారని, దీనివల్ల వేల కోట్ల ప్రజాధనం ఆదా అవుతుందని, దేశ అభివృద్ధి వేగవంతమవుతుందని వివరించారు. రాహుల్‌గాంధీ సామాజిక న్యాయం గురించి మాట్లాడ్డమంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని మండిపడ్డారు. రిజర్వేషన్లను, సామాజిక న్యాయాన్ని మొదటి నుంచీ కాంగ్రెస్‌ అడ్డుకుందని లక్ష్మణ్‌ ఆరోపించారు.

Updated Date - Nov 08 , 2024 | 02:53 AM