ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kishan Reddy: సీఎం రేవంత్‌ ధర్నా విడ్డూరం

ABN, Publish Date - Dec 19 , 2024 | 03:28 AM

సీఎం రేవంత్‌, ఆయన మంత్రి వర్గ సహచరులు, పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి రాజ్‌ భవన్‌ ఎదుట ధర్నా చేయడం విడ్డూరంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు.

  • అదానీపై మాట్లాడే నైతిక హక్కు సీఎంకు లేదు

  • అవినీతి జరిగిందని ఒక్క సాక్ష్యమైనా చూపగలరా?

  • తాటాకు చప్పుళ్లకు మోదీ ప్రభుత్వం భయపడదు

  • స్కిల్స్‌ వర్సిటీ కోసం అదానీని రూ.100కోట్లు అడిగినప్పుడు

  • ఈ అంశం గుర్తు లేదా? కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌, ఆయన మంత్రి వర్గ సహచరులు, పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి రాజ్‌ భవన్‌ ఎదుట ధర్నా చేయడం విడ్డూరంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ, అదానీపై విమర్శలు చేస్తూ సీఎం, కాంగ్రెస్‌ నేతలు ధర్నా చేయడాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. అదానీపై మాట్లాడే నైతిక హక్కు సీఎం రేవంత్‌కు లేదని అన్నారు. స్కిల్‌ యూనివర్సిటీకి రూ.100కోట్ల మేర సాయం చేయాలని అదానీని ఎందుకు అడిగారు? ఎవరు అడిగారు? అప్పుడు ఈ విషయాలన్నీ గుర్తు లేవా?... ఇవన్నీ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. ఢిల్లీలోని అధికారిక నివాసంలో కిషన్‌రెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడారు. ఏ ప్రాతిపదికన అదానీ మీద చర్యలు తీసుకోవాలి? అవినీతి జరిగిందని ఒక సాక్ష్యమైనా చూపిస్తారా? అని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌, సీఎం రేవంత్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. అమెరికాలో ఎవడో ఆధారాల్లేకుండా అదానీపై మాట్లాడితే దానిమీద రాద్థాంతం చేయడం కాంగ్రెస్‌ దివాలాకోరుతనానికి నిదర్శనమని అన్నారు. జేపీసీ వేయకపోతే రాష్ట్రపతి భవనం ఎదుట ధర్నా చేస్తామని రేవంత్‌ చెప్పడం సిగ్గుచేటని, తాటాకు చప్పుళ్లకు మోదీ ప్రభుత్వం భయపడదని స్పష్టం చేశారు.


వసూళ్లలో దొందూ దొందే

సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌ నాణేనికి బొమ్మ, బొరుసు లాంటి వారని, కాంట్రాక్టర్లను బెదిరించి డబ్బులు వసూలు చేయడంలో దొందూ దొందేనని కిషన్‌రెడ్డి విమర్శించారు. ప్రజలను వంచించడంలో, తెలంగాణ సంపదను దోచుకోవడంలో, కుటుంబ పరిపాలన తీసుకురావడంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సకు తేడా లేదని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల్లోనూ ఆ రెండు పార్టీల తీరు ఒక్కటేనని గుర్తు చేశారు. కేసీఆర్‌ ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారిస్తే, రేవంత్‌ మరింత దిగజారుస్తున్నారని విమర్శించారు. అల్లు అర్జున్‌ను అరెస్టు చేసి సెన్సేషన్‌ క్రియేట్‌ చేయడం, హైడ్రా-మూసీ పేరుతో ఇళ్లు కూలగొట్టడం... తప్ప ఏమైనా చేశారా? అని సీఎం రేవంత్‌ను ప్రశ్నించారు.

Updated Date - Dec 19 , 2024 | 03:28 AM