ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kishan Reddy: మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లు కూల్చొద్దు

ABN, Publish Date - Oct 27 , 2024 | 04:33 AM

మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లు కూల్చొద్దని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుతాన్ని కోరారు. శనివారం ముషీరాబాద్‌లో వివిధ అభివృద్ధి పనులను స్థానిక ఎమ్మెల్యే ముఠాగోపాల్‌తో కలిసి కిషన్‌రెడ్డి ప్రారంభించారు.

  • హైదరాబాద్‌ అభివృద్ధికి నిధులు విడుదల చేయాలి: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

ముషీరాబాద్‌, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లు కూల్చొద్దని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుతాన్ని కోరారు. శనివారం ముషీరాబాద్‌లో వివిధ అభివృద్ధి పనులను స్థానిక ఎమ్మెల్యే ముఠాగోపాల్‌తో కలిసి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశంలో అభివృద్ధి చెందుతున్న నగరాలలో హైదరాబాద్‌ ఒకటని, కానీ ఇక్కడి ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా నగర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదని విమర్శించారు. అస్తవ్యస్తంగా మారిన డ్రైనేజీ, అద్వానపు రోడ్లు, వెలగని వీధి దీపాలు తదితర సమస్యలతో నగర ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.


హైదరాబాద్‌లో డ్రైౖనేజీ వ్యవస్థ అద్వానంగా మారిందని ప్రభుత్వం వెంట నే మేలుకోకపోతే రానున్న రోజుల్లో డ్రైనేజీ వ్యవస్థ స్తంభించిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో అభివృద్ధి పనులకు పలు మార్లు టెండర్లకు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని అన్నారు. హైలెవల్‌ మీటింగ్‌ ఏర్పా టు చేసి హైదరాబాద్‌ అభివృద్ధికి వెంటనే నిధులు విడుదల చేయాలని కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Updated Date - Oct 27 , 2024 | 04:33 AM