ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kishan Reddy: వీధిలైట్లు ఎందుకు వెలగడం లేదు.. పాడైపోతే.. కొత్త వాటిని బిగించరా..

ABN, Publish Date - Nov 09 , 2024 | 07:37 AM

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌(Hyderabad) నగరంలో వీధిలైట్లు ఎందుకు వెలగడం లేదు.. పాడైపోయిన వాటి స్థానంలో కొత్తవాటిని బిగించడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారు.. జీహెచ్‌ఎంసీలో ఎన్ని లైట్లు కాలిపోయాయి.. ఎన్ని వెలుగుతున్నాయో.. అసలు మీకు తెలుసా.. అని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి(Union Minister Kishan Reddy) అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

- విశ్వకర్మ దరఖాస్తుల పరిశీలనపై నిర్లక్ష్యమేమిటీ..

- ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో బిల్లుల దోపిడీపై చర్యలు తీసుకోరా..

- ‘దిశ’ సమావేశంలో వివిధశాఖల పనితీరుపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం

హైదరాబాద్‌ సిటీ: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌(Hyderabad) నగరంలో వీధిలైట్లు ఎందుకు వెలగడం లేదు.. పాడైపోయిన వాటి స్థానంలో కొత్తవాటిని బిగించడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారు.. జీహెచ్‌ఎంసీలో ఎన్ని లైట్లు కాలిపోయాయి.. ఎన్ని వెలుగుతున్నాయో.. అసలు మీకు తెలుసా.. అని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి(Union Minister Kishan Reddy) అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను నగరంలోని బస్తీల్లో పర్యటించిన సమయంలో చాలామంది వీధిలైట్ల సమస్యనే తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: కారు పార్కింగ్‌లో పెట్టమన్నందుకు తుపాకీతో బెదిరింపు


బేగంపేటలోని టూరిజం ప్లాజాలో శుక్రవారం డెవల్‌పమెంట్‌ కోఆర్డినేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ (దిశ) సమావేశం నిర్వహించారు. దిశ కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌, కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛభారత్‌ మిషన్‌, ఎల్‌ఎండీ (లీడ్‌ బ్యాంక్‌ డిస్టిక్ట్‌ మేనేజర్‌), ముద్ర, విద్యా రుణాలు, ఎంఎ్‌సఎంఈలపై మంత్రి సమీక్షించారు. అలాగే నగరంలో రైల్వే విస్తరణ పనులు,ఎలక్ర్టిసిటీ, నేషనల్‌ హైవేస్‌, బ్రిడ్జిల నిర్మాణాలను తెలుసుకున్నారు.


విశ్వకర్మ పథకంపై నిర్లక్ష్యమెందుకు..?

దిశ సమీక్షలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విశ్వకర్మ పథకం నిర్వహణ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో 18వేల దరఖాస్తులు వస్తే.. 620 మంది లబ్ధిదారులకే సాయం అందించడం సిగ్గుచేటన్నారు. 45 రోజుల్లో గ్రౌండింగ్‌ పూర్తి చేసి లబ్ధిదారులకు సాయం అందించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో మరుగుదొడ్ల నిర్వహణపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. నగరవాసులకు కనీస సౌకర్యాలు కల్పించకపోవడం దారుణమని, స్వచ్ఛభారత్‌లో కేంద్రం వాటాతోపాటు రాష్ట్ర వాటా కూడా ఇవ్వాల్సి ఉంటుందన్నారు.


నగరంలో మొత్తం 2251 టాయిలెట్లు ఉన్నాయని, వాటి క్లీనింగ్‌, మెయింటనెన్స్‌పై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో బిల్లుల చెల్లింపులు, ఇతర కారణాలతో మృతదేహాలను సంబంధిత కుటుంబానికి ఇవ్వకుండా యాజమాన్యాలు ఇబ్బంది పెడుతున్న ఘటనలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ జిల్లాలో పీఎం ముద్ర రుణాల కింద 1,16,198 మందికి సాయం అందజేశామని మంత్రికి.. కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి వివరించారు. అధికారులు, బ్యాంకర్లకు మధ్య ఉన్న సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అంబర్‌పేట్‌లో చేపట్టిన ఫ్లైఓవర్‌ను ఎప్పుడు పూర్తిచేస్తారని కిషన్‌రెడ్డి నేషనల్‌ హైవేస్‌ అధికారులను ప్రశ్నించారు. జనవరిలోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.


కేంద్ర పథకాలను పారదర్శకంగా అమలు చేయాలి

కేంద్ర పథకాలను పారదర్శకంగా అమలు చేయాలని మంత్రి కిషన్‌రెడ్డి అధికారులకు సూచించారు. కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయిస్తున్న మొదటి రూపాయిని దివ్యాంగుల సంక్షేమానికి ఇవ్వాలని, సదరం సర్టిఫికెట్లను పెండింగ్‌లో లేకుండా త్వరగా అందజేయాలన్నారు.రాష్ట్రంలో 70-80శాతం ఆదాయం హైదరాబాద్‌ నగరం నుంచే వస్తున్నప్పటికీ.. జీహెచ్‌ఎంసీ, మెట్రో వాటర్‌వర్క్స్‌ డిపార్ట్‌మెంట్లకు నిధుల కొరత విచారకరమన్నారు.


ఈవార్తను కూడా చదవండి: Hyderabad: మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌.. ఆన్‌లైన్‌లోనే!

ఈవార్తను కూడా చదవండి: AV Ranganath: బెంగళూరులో ముగిసిన ‘హైడ్రా’ పర్యటన

ఈవార్తను కూడా చదవండి: jeevan Reddy:మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాల్‌కు మరోసారి నోటీసులు

ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: మూసీ పునరుజ్జీవాన్ని అడ్డుకుంటే కుక్కచావే

Read Latest Telangana News and National News

Updated Date - Nov 09 , 2024 | 07:37 AM