Kodandaram: ధరణి పేరిట భూముల స్వాహా: కోదండరాం
ABN, Publish Date - Aug 20 , 2024 | 03:59 AM
ధరణి పేరిట ఒక కుటుంబం భూములను స్వాహా చేసిందని ఎమ్మెల్సీ కోదండరాం ఆరోపించారు.
హైదరాబాద్, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): ధరణి పేరిట ఒక కుటుంబం భూములను స్వాహా చేసిందని ఎమ్మెల్సీ కోదండరాం ఆరోపించారు. తెలంగాణ భూ రికార్డులను కూడా ధ్వంసం చేశారని మండిపడ్డారు. రవీంద్రభారతిలో రెవెన్యూ ఉద్యోగులు నిర్వహించిన ఆత్మీయ అభినందన సభలో ఆయన మాట్లాడారు. రెవెన్యూ ఉద్యోగులకు అండగా ఉంటూ అన్ని రకాల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. గత పాలకులు అప్రకటిత నిర్భందం ప్రకటించారని, సమస్యలు చెప్పుకొనే అవకాశం కూడా ఇవ్వలేదన్నారు.
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ఉద్యమకారులను విస్మరించారన్నారు. భూ చట్టాల నిపుణుడు సునీల్ మాట్లాడుతూ కీలకమైన రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చే ముందు కోదండరాం మండలిలో అడుగుపెడుతుండడం సంతోషంగా ఉందన్నారు. రెవెన్యూ వ్యవస్థ పునర్నిర్మాణంలో కోదండరాం కీలక పాత్ర పోషించాలని డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు లచ్చిరెడ్డి ఆకాంక్షించారు.
Updated Date - Aug 20 , 2024 | 03:59 AM