Komatireddy: నేనున్నాగా.. బాగా చదువుకో..!
ABN, Publish Date - Dec 30 , 2024 | 03:41 AM
‘నువ్వేం భయపడకు.. నేనున్నాగా.. నువ్వు బాగా చదువుకో.. అండగా నేనుంటా’ అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓ పేద విద్యార్థినికి భరోసానిచ్చారు. ఆమెకు రూ.లక్ష ఆర్థిక సాయాన్ని అందించారు.
పేద విద్యార్థినికి మంత్రి కోమటిరెడ్డి భరోసా
హైదరాబాద్, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ‘నువ్వేం భయపడకు.. నేనున్నాగా.. నువ్వు బాగా చదువుకో.. అండగా నేనుంటా’ అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓ పేద విద్యార్థినికి భరోసానిచ్చారు. ఆమెకు రూ.లక్ష ఆర్థిక సాయాన్ని అందించారు. చొల్లేటి ప్రణవి అనే విద్యార్థినికి ఇటలీలోని ప్రఖ్యాత విద్యాసంస్థ ‘పాలిటెన్సికో డి టోరినో’ (పాలిటో) కాలేజీలో ఆర్కిటెక్చర్ కన్‌స్ట్రక్షన్‌లో మాస్టర్స్(పీజీ) చేసేందుకు సీటు వచ్చింది. అయితే ప్రణవి కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడం.. ఆమెను దిక్కుతోచని స్థితిలో పడేసింది.
ఈ నేపథ్యంలోనే విషయం తెలిసిన మంత్రి కోమటిరెడ్డి తక్షణమే స్పందించారు. ఆదివారం ప్రణవి కుటుంబాన్ని హైదరాబాద్ నివాసానికి పిలిపించుకున్నారు. ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా తక్షణ సాయంగా రూ.లక్ష చెక్కును అందజేశారు. ప్రతిభ కలిగిన ఏ విద్యార్థి చదువు కూడా ఆగిపోకూడదని, చదువు జీవితాలను మార్చే ఆయుధమని మంత్రి ఈ సందర్భంగా అన్నారు.
Updated Date - Dec 30 , 2024 | 03:41 AM