ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఏపీ ఆధీనంలోని ఆర్‌ అండ్‌ బీ ఆస్తుల స్వాధీనానికి కసరత్తు.. కోమటిరెడ్డి సమీక్ష

ABN, Publish Date - Jul 03 , 2024 | 05:48 AM

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న హైదరాబాద్‌లోని ఆర్‌ అండ్‌ బీ ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.

ఏపీ ఆధీనంలోని ఆర్‌ అండ్‌ బీ ఆస్తుల

స్వాధీనానికి కసరత్తు: మంత్రి కోమటిరెడ్డి

హైదరాబాద్‌, జూలై 2 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న హైదరాబాద్‌లోని ఆర్‌ అండ్‌ బీ ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఇరు రాష్ట్రాల సీఎంలు రేవంత్‌ రెడ్డి, చంద్రబాబు జూలై 6న సమావేశం కానున్నారు.

ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ఆర్‌ అండ్‌ బీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌లో ఏపీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆర్‌ అండ్‌ బీ ఆస్తుల స్వాధీనంపై చర్చించారు. లేక్‌ వ్యూ అథితి గృహం, మినిస్టర్స్‌ క్వార్టర్స్‌, ఆదర్శనగర్‌, బషీర్‌ బాగ్‌, కుందన్‌బాగ్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న ఎమ్మెల్యేల నివాస సముదాయాలు, గ్రీన్‌ల్యాండ్స్‌, మంజీర అతిథి గృహాలు, ఇతర ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు అవసరమైన సమాచారం, ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

Updated Date - Jul 03 , 2024 | 06:39 AM

Advertising
Advertising