ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Konda Surekha: తెలంగాణ ఖ్యాతిని చాటేలా బోనాలు..

ABN, Publish Date - Jun 27 , 2024 | 04:25 AM

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న దశాబ్ది ఆషాఢ మాస బోనాలను వైభవంగా నిర్వహించేందుకు ప్రతిపాదించిన పనులను వివిధ శాఖల సమన్వయంతో జూలై 5లోగా పూర్తిచేయాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు.

  • జూలై 5లోగా ఏర్పాట్లు పూర్తి.. 20 కోట్ల నిధుల కేటాయింపు

  • అధికారులతో సమీక్షలో మంత్రి కొండా సురేఖ

హైదరాబాద్‌, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న దశాబ్ది ఆషాఢ మాస బోనాలను వైభవంగా నిర్వహించేందుకు ప్రతిపాదించిన పనులను వివిధ శాఖల సమన్వయంతో జూలై 5లోగా పూర్తిచేయాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. టూరిజం ప్లాజాలో బుధవారం ఆషాఢ బోనాల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులు, ప్రధాన దేవాలయాల ఛైర్మన్లు, ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి కొండా సురేఖ సమీక్షించారు.


దశాబ్ది బోనాల ఉత్సవాలను తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా గతంలోకంటే వైభవంగా నిర్వహించాలని ఆమె ఆదేశించారు. ఏర్పాట్లకు ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. బోనాలను గ్రంధస్థం చేయడంతోపాటు డాక్యుమెంటరీ చేయాలని సూచించారు. ఎంపిక చేసిన 28 ఆలయాలకు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను సమర్పించనున్నట్టు తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ బోనాల్లో ప్రసాదం శుభ్రత, నాణ్యతతో ఉండాలని, నాణ్యమైన తాగునీరు భక్తులకు అందించాలని సూచించారు.

Updated Date - Jun 27 , 2024 | 04:25 AM

Advertising
Advertising