Konda Surekha: కేటీఆర్ తన తండ్రిని ఏమైనా.. చేశాడేమోనని అనుమానం ఉంది
ABN, Publish Date - Oct 04 , 2024 | 03:43 AM
కేటీఆర్‌కు పదవీకాంక్ష ఎక్కువని, దీంతో ఆయన తన తండ్రి కేసీఆర్‌ను ఏమైనా చేశాడేమోనని అనుమానం వస్తోందని, ప్రతిపక్ష నేత అయిన కేసీఆర్‌ను రక్షించుకోవడం మనందరి బాధ్యత అని మంత్రి కొండా సురేఖ అన్నారు.
ఆయనకు పదవీకాంక్ష ఎక్కువ
కేసీఆర్ కనిపించడం లేదని ఫిర్యాదు చేయండి: సురేఖ
ఆయిల్ పామ్ లో తెలంగాణను అగ్రగామి చేస్తాం: తుమ్మల
గజ్వేల్, అక్టోబరు 3: కేటీఆర్‌కు పదవీకాంక్ష ఎక్కువని, దీంతో ఆయన తన తండ్రి కేసీఆర్‌ను ఏమైనా చేశాడేమోనని అనుమానం వస్తోందని, ప్రతిపక్ష నేత అయిన కేసీఆర్‌ను రక్షించుకోవడం మనందరి బాధ్యత అని మంత్రి కొండా సురేఖ అన్నారు. కేసీఆర్ కనిపించడం లేదని గజ్వేల్ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని స్థానిక కాంగ్రెస్ నాయకులకు ఆమె సూచించారు. గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో నిర్వహించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అధికారం కోల్పోవడంతో కేటీఆర్‌కు మతిభ్రమించిందని, దిక్కుమాలిన సోషల్ మీడియాని పెట్టుకొని ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. తండ్రి ముఖ్యమంత్రిగా ఉండగా ఆయనను నామమాత్రం చేసి కోట్లాది రూపాయల సొమ్మును దోచుకున్నారని, అనేక కుంభకోణాలకు కేటీఆర్ ఆధ్యుడు అయ్యారని ఆరోపించారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ఆయిల్ పామ్ సాగులో దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలిపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. సిద్దిపేటలో వచ్చే ఏడాది కల్లా ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని, రిఫైనరీని ఏర్పాటు చేస్తామన్నారు.
Updated Date - Oct 04 , 2024 | 03:43 AM