ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Karimnagar: టెస్కాబ్‌ చైర్మన్‌ పదవికి ‘కొండూరి’ రాజీనామా..

ABN, Publish Date - Jun 01 , 2024 | 05:08 AM

తెలంగాణ స్టేట్‌ కో ఆపరేటివ్‌ అగ్రికల్చరల్‌ బ్యాంకు (టెస్కాబ్‌) చైర్మన్‌ పదవికి కొండూరి రవీందర్‌రావు రాజీనామా చేశారు. ఆయనతోపాటు వైస్‌ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌ రెడ్డి కూడా తన పదవికి రాజీనామా చేశారు. టెస్కాబ్‌లో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ కలిపి తొమ్మిది మంది డైరెక్టర్లు ఉన్నారు.

  • వైస్‌చైర్మన్‌ కూడా.. అవిశ్వాసం నోటీసుతో నిర్ణయం

కరీంనగర్‌, హైదరాబాద్‌, మే 31 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): తెలంగాణ స్టేట్‌ కో ఆపరేటివ్‌ అగ్రికల్చరల్‌ బ్యాంకు (టెస్కాబ్‌) చైర్మన్‌ పదవికి కొండూరి రవీందర్‌రావు రాజీనామా చేశారు. ఆయనతోపాటు వైస్‌ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌ రెడ్డి కూడా తన పదవికి రాజీనామా చేశారు. టెస్కాబ్‌లో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ కలిపి తొమ్మిది మంది డైరెక్టర్లు ఉన్నారు. వీరిలో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ మినహా ఏడుగురు డైరెక్టర్లు ఇటీవల బీఆర్‌ఎ్‌సను వదిలి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కాంగ్రె్‌సలో చేరిన డైరెక్టర్లు వీరిపై ఇటీవల అవిశ్వాస నోటీసు ఇచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జూన్‌ 10న అవిశ్వాస నోటీసుపై సమావేశం జరగనుండగా శుక్రవారమే తమ రాజీనామాలను సమర్పించారు. కరీంనగర్‌ కేంద్ర బ్యాంకు చైర్మన్‌గా, టెస్కాబ్‌ చైర్మన్‌గా దశాబ్దకాలంగా బాధ్యతలు నిర్వర్తించిన కొండూరి రవీందర్‌రావు కరీంనగర్‌ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్‌గా కొనసాగనున్నారు.


సిరిసిల్ల నియోజకవర్గం గంభీరావుపేటకు చెందిన రవీందర్‌రావు మొదటి నుంచి కాంగ్రెస్‌ నాయకుడిగా ఉన్నారు. ఆయన ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2014లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా, ప్రస్తుత ఎమ్మెల్యే కేటీఆర్‌పై పోటీచేసి ఓడిపోయారు. ఏడాది తిరిగేసరికి కాంగ్రె్‌సకు రాజీనామా చేసి బీఆర్‌ఎ్‌సలో చేరారు. 2015లో కరీంనగర్‌ కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షుడిగా ఎన్నికైన రవీందర్‌రావు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా టెస్కాబ్‌ చైర్మన్‌ పదవి చేపట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఇటు కరీంనగర్‌ డీసీసీబీ చైర్మన్‌, అటు టెస్కాబ్‌ చైర్మన్‌గా పదవిలోనూ కొనసాగారు. కాగా, టెస్కాబ్‌ చైర్మన్‌ స్థానానికి రాజీనామా చేయటంతో కొండూరి రవీందర్‌రావు న్యాప్‌కాబ్‌ చైర్మన్‌ పదవిని కూడా కోల్పోయే అవకాశాలున్నాయి.


కొత్తగా ఎన్నికయ్యే టెస్కాబ్‌ పాలకవర్గం... రవీందర్‌రావును నేషనల్‌ బ్యాంకు చైర్మన్‌ పదవిలో కొనసాగితే అభ్యంతరంలేదని ఢిల్లీకి లేఖ రాస్తే.. ఆ పదవిలో తెలంగాణ ప్రతినిధిగా ఆయన కొనసాగుతారు. లేదంటే న్యాప్‌కాబ్‌ పదవిని కోల్పోతారు. కాగా, టెస్కాబ్‌ ఆధ్వర్యంలో గడిచిన పదేళ్లలో రూ.30 వేల కోట్లకు పైగా వ్యాపార వృద్ధి జరిగినట్లు టెస్కాబ్‌ చైర్మన్‌ పదవికి రాజీనామా చేసిన కొండూరి రవీందర్‌రావు ప్రకటించారు. టెస్కాబ్‌ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎవరో పదవి నుంచి దించేదాకా ఉండడం ఎందుకునే రాజీనామా చేసినట్టు ప్రకటించారు.


  • రాజీనామా హర్షణీయం: కేటీఆర్‌

బీఆర్‌ఎస్‌ నేతలు ఇద్దరు ఒకే రోజు తమ అధికారిక పదవులకు రాజీనామా చేయడం అభినందనీయమని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమని, పదవులను గడ్డిపరకలా వదిలేయాలన్న కేసీఆర్‌ బాటలోనే.. వారిద్దరూ రాజీనామా చేశారని తెలిపారు.

Updated Date - Jun 01 , 2024 | 05:08 AM

Advertising
Advertising