Krishna Express: కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కి యాభై ఏళ్లు
ABN, Publish Date - Oct 03 , 2024 | 04:25 AM
జాతిపిత మహాత్మగాంధీ పుట్టిన అక్టోబరు 2వ తేదీకి దక్షిణమధ్య రైల్వేకి విడదీయరాని అనుబంధం ఉంది. ఈ జోన్ పరిధిలో ఎన్నో కార్యక్రమాలు ఇదే రోజున ప్రారంభమయ్యాయి.
అప్పట్లో పగటి పూట నడిచే తొలి ఎక్స్‌ప్రెస్ రైలు
మొదట్లో విజయవాడకే... అనంతరం తిరుపతి వరకు..
చిలకలగూడ, అక్టోబరు2 (ఆంధ్రజ్యోతి): జాతిపిత మహాత్మగాంధీ పుట్టిన అక్టోబరు 2వ తేదీకి దక్షిణమధ్య రైల్వేకి విడదీయరాని అనుబంధం ఉంది. ఈ జోన్ పరిధిలో ఎన్నో కార్యక్రమాలు ఇదే రోజున ప్రారంభమయ్యాయి. అంతెందుకు దక్షిణమధ్య రైల్వే ప్రారంభమైందే 1966, అక్టోబరు 2వ తేదీన! అంతేగాక తెలుగువారికి సుపరిచితమైన కృష్ణా ఎక్స్‌ప్రెస్ కూడా యాభై ఏళ్ల క్రితం ఇదే తేదీన మొదలైంది. అక్టోబరు 2, 1974లో సికింద్రాబాద్ నుంచి విజయవాడకి డీజిల్ ఇంజిన్‌తో లాంఛనంగా దీన్ని ఆరంభించారు.
ఇరు ప్రాంతాల మధ్య సుప్రసిద్ధమైన కృష్ణా నది ఉండటం వల్లే దానికి ‘కృష్ణా ఎక్స్‌ప్రెస్’ అనే పేరును పెట్టారు. అప్పట్లో పగటిపూట నడిచే మొట్టమొదటి ఎక్స్‌ప్రెస్ రైలు ఇదే కావడం విశేషం. మొదట్లో సికింద్రాబాద్ నుంచి విజయవాడ వరకు మాత్రమే నడిచేది. తరువాత గుంటూరు వరకు పొడిగించారు. ప్రస్త్తుతం ఆదిలాబాద్ నుంచి తిరుపతి మధ్య సేవలు కొనసాగుతున్నాయి. దాదాపు ప్రయాణం మొత్తం పగటి పూట కావడంతో ప్రయాణికుల ఆదరణ పొందింది. బుధవారం యాభై ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా పలువురు తెలుగువారు కృష్ణా ఎక్స్‌ప్రె్‌సతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు.
Updated Date - Oct 03 , 2024 | 04:25 AM