Krishna Express: ప్రయాణికులకు అలర్ట్.. కృష్ణా ఎక్స్‌ప్రెస్ ఆలస్యం..
ABN, Publish Date - Dec 24 , 2024 | 07:00 AM
ప్రయాణికులకు అలర్ట్. ఈరోజు సికింద్రాబాద్ నుంచి బయలుదేరాల్సిన కృష్ణా ఎక్స్ ప్రెస్ ఇంకా మొదలుకాలేదు. ఎందుకంటే పలు కారణాలతో ఈ ట్రైన్ ఇంకా సికింద్రాబాద్ చేరుకోలేదు. దీంతో ఈ రైలు కోసం స్టేషన్ వచ్చిన ప్రయాణికులు ఇక్కట్లు పడుతున్నారు.
సికింద్రాబాద్(secunderabad)కు చేరాల్సిన కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలు (Krishna Express) ఈరోజు ఇంకా రాలేదు. దీంతో ఈ ట్రెన్ కోసం చూస్తున్న ప్రయాణికులు అలాగే వేచి చూస్తున్నారు. అయితే ఈ ట్రైన్ ఆరు గంటల ఆలస్యంగా నడుస్తుందని అధికారులు తెలిపారు. ఈ రైలు తిరుపతి నుంచి సికింద్రాబాద్ మీదుగా ఆదిలాబాద్‌కి వెళ్లాల్సి ఉంది. రైల్వే ట్రాక్‌పై పలు మార్పుల కారణంగా రైలు ఆలస్యం అవుతుందని అధికారులు ప్రకటించారు. దీంతో ఈ ట్రైన్ కోసం వచ్చి టిక్కెట్లను తీసుకున్న ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇతర ట్రైన్లు కూడా ఆలస్యం..
రైలు సమయానికి రాకపోవడంతో ప్రయాణికులు ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. కొంతమంది రైలు ఆలస్యానికి సంబంధించిన సమాచారం కోసం అధికారులను సంప్రదించారు. అధికారులు ఈ ఆలస్యం గురించి వివరించారు. రైల్వే ట్రాక్ పనుల కారణంగా ప్రస్తుత సమయంలో పలు మార్పులు అవసరం అవుతున్నాయని చెప్పారు. అందువల్ల సమయానికి కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలు రావడం కష్టం అయ్యిందన్నారు. అధికారులు ప్రస్తుత పరిస్థితిని చెక్ చేస్తూ, రైలు త్వరగా ప్రారంభం అవుతుందని చెబుతున్నారు. ఈ క్రమంలో రైల్వే అధికారులు ప్రస్తుత పరిస్థితిని త్వరగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఏర్పాట్లు చేస్తున్నారా
అయితే సికింద్రాబాద్‌లో ఈ ట్రైన్ ఆలస్యం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులకు ఏవైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారా అనే దానిపై సమాచారం లేదు. ఈ ట్రైన్ ఆలస్యం వల్ల ఇతర రైలు ప్రయాణాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నేడు రైళ్లలో ప్రయాణం చేసే ప్రయాణికులు ఆయా ట్రైన్ల సమయాలను క్రమం తప్పకుండా చూసుకుని ప్రయాణం చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Top Mutual Funds: గత ఐదేళ్లలో టాప్ 7 మ్యూచువల్ ఫండ్స్.. ఎంత రిటర్న్స్ ఇచ్చాయంటే..
Cyber Protection: సైబర్ మోసాల నుంచి మీ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లను ఇలా రక్షించుకోండి..
Public Holidays: 2025లో పబ్లిక్ హాలిడేస్ ఎన్ని రోజులో తెలుసా..
Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..
Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..
Personal Finance: రూ. 10 వేల పొదుపుతో రూ. 7 కోట్ల సంపాదన.. ఎలాగో తెలుసా..
Read More Telangana News and Latest Telugu News
Updated Date - Dec 24 , 2024 | 07:23 AM