ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KTR: అదానీతో బీజేపీ, కాంగ్రెస్‌ అనుబంధం దేశానికే అవమానం: కేటీఆర్‌

ABN, Publish Date - Nov 22 , 2024 | 02:22 AM

‘అగ్రరాజ్యం అమెరికానే మోసం చేయాలని చూసిన ఘనుడు.. భారత ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వజూపిన మోసగాడు.. అదానీలాంటి దగాకోరుకు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అనుమతులు ఇచ్చారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు.

‘అగ్రరాజ్యం అమెరికానే మోసం చేయాలని చూసిన ఘనుడు.. భారత ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వజూపిన మోసగాడు.. అదానీలాంటి దగాకోరుకు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అనుమతులు ఇచ్చారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. రామన్నపేటలో అంబుజా సిమెంట్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఎంత ఇవ్వజూపిండో, మూసీలో అదానీ వాటా ఎంతో చెప్పాలని ‘ఎక్స్‌’లో డిమాండ్‌ చేశారు. ‘తెలంగాణ ఆస్తులను కొల్లగొట్టే కుయుక్తుల్లో మీ బడే భాయ్‌ వాటా.. మీ అదానీ భాయ్‌ వాటా.. మీ హైకమాండ్‌ వాటా ఎంత?’ అని పరోక్షంగా సీఎం రేవంత్‌ రెడ్డిని ప్రశ్నించారు. అదానీతో బీజేపీ, కాంగ్రెస్‌ అనుబంధం దేశానికే అవమానం, అరిష్టమని, అవి అదానీతో చేసుకున్న చీకటి ఒప్పందాలను బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Nov 22 , 2024 | 02:22 AM