విద్యార్థినులు వీధుల్లో పోరాడుతుంటే..‘జూ’ ఏర్పాటుకు ప్రయత్నాలా?: కేటీఆర్
ABN, Publish Date - Sep 01 , 2024 | 05:05 AM
తమకు కనీస అవసరాలు కల్పించాలంటూ ఓవైపు తెలంగాణ ఆడబిడ్డలైన విద్యార్థినులు వీధుల్లో పోరాటం చేస్తుంటే.. ఇంకోవైపు హైదరాబాద్‌లో మరో ‘జూ’ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): తమకు కనీస అవసరాలు కల్పించాలంటూ ఓవైపు తెలంగాణ ఆడబిడ్డలైన విద్యార్థినులు వీధుల్లో పోరాటం చేస్తుంటే.. ఇంకోవైపు హైదరాబాద్‌లో మరో ‘జూ’ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. అంటే.. విద్యార్థినుల సమస్యల పరిష్కారం కన్నా ‘జూ’పార్క్ నిర్మాణానికే సీఎం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని ‘ఎక్స్’ వేదికగా విమర్శించారు. దయచేసి సీఎంగారు ముందు ప్రజల సమస్యలను పరిష్కరించే అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. కాగా, ప్రజాపాలన పేరుతో ప్రజలను ఏమార్చి అధికారంలోకి వచ్చి దోపిడీ పాలన చేస్తున్న కాంగ్రెస్ నాయకులే డెకాయిట్లు అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేవేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్‌ను డెకాయిట్ అంటూ మంత్రి ఉత్తమ్ సంబోధించడం దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు.
Updated Date - Sep 01 , 2024 | 05:05 AM