TTD Chairman: తిరుమలలో మా లేఖలూ పరిగణించండి
ABN, Publish Date - Nov 21 , 2024 | 04:55 AM
తిరుమలకు వచ్చే తెలంగాణ భక్తుల దర్శనానికి ఇక్కడి ప్రజాప్రతినిధులైన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇచ్చే లేఖలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడును బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు.
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు కేటీఆర్ వినతి
హైదరాబాద్, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): తిరుమలకు వచ్చే తెలంగాణ భక్తుల దర్శనానికి ఇక్కడి ప్రజాప్రతినిధులైన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇచ్చే లేఖలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడును బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు.
టీటీడీ నూతన చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన బీఆర్‌నాయుడును కేటీఆర్ బుధవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన ఆలయాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని, కరీంనగర్, సిరిసిల్లలో గతంలో శంకుస్థాపన చేసిన టీటీడీ దేవాలయాల నిర్మాణాలు శరవేగంగా పూర్తిచేయాలని బీఆర్ నాయుడును కేటీఆర్ విన్నవించారు.
Updated Date - Nov 21 , 2024 | 04:55 AM