KTR: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కేటీఆర్ లేఖ.. విషయం ఏంటంటే?
ABN, Publish Date - Aug 30 , 2024 | 03:39 PM
తెలంగాణ రాజకీయాల్లో ‘హైడ్రా కూల్చివేతలు’ ప్రకంపనలు రేపుతున్న విషయం తెలిసిందే. విపక్ష పార్టీలకు చెందిన నేతలను దెబ్బతీసేందుకేనని బీఆర్ఎస్ సహా ఇతర పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ లేఖ రాశారు.
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ‘హైడ్రా కూల్చివేతలు’ ప్రకంపనలు రేపుతున్న విషయం తెలిసిందే. విపక్ష పార్టీలకు చెందిన నేతలను దెబ్బతీసేందుకేనని బీఆర్ఎస్ సహా ఇతర పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ లేఖ రాశారు. దయచేసి తెలంగాణను మరో బుల్‌డోజర్ రాజ్యంగా మారకుండా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి సలహా ఇవ్వాలని లేఖలో కేటీఆర్ కోరారు.
లేఖలో ఏముందంటే?
ప్రియమైన మల్లికార్జున ఖర్గే గారూ.. మీరు చెప్పినట్లుగా ఒకరి ఇంటిని కూల్చివేసి, వారి కుటుంబాన్ని నిరాశ్రయులుగా మార్చడం అమానవీయం, అన్యాయం. తెలంగాణాలో చట్టం, న్యాయవ్యవస్థ పట్ల తీవ్ర ధిక్కారం జరుగుతోంది. మహబూబ్‌నగర్ పట్టణంలో 75 పేదల ఇళ్లను తెల్లవారుజామున 3 గంటలకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేశారు. నిన్న అక్రమంగా కూల్చివేసిన నిరుపేదల్లో 25 కుటుంబాల్లో శారీరక వికలాంగులు కూడా ఉన్నారు. ఆమోదయోగ్యమైన పద్ధతులు పాటించకుండా, విధి విధానాలు లేకుండా అమలు చేసే చట్టం చట్టమే కాదు. అడ్డగోలుగా నిరుపేదలపైకి బుల్డోజర్ నడిపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణను మరో బుల్డోజర్ రాజ్యాంగ మార్చకుండా ఆదేశాలు ఇవ్వండి’’ అంటూ మల్లికార్జున ఖర్గేకి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
9 నెలలుగా విద్యాశాఖకు మంత్రి లేడు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
గత 9 నెలలుగా తెలంగాణాలో విద్యాశాఖకు మంత్రి లేడని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యానించారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం ఎప్పుడైనా సమీక్షా చేశారా అని ఆయన ప్రశ్నించారు. విద్యా శాఖపై సీఎంకి కనీస అవగాహనా లేదని విమర్శించారు. ఈ మేరకు ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.
‘‘ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. విద్యార్థులకు యూనిఫామ్స్ లేవు. చలికాలం వస్తోంది ఉలన్ రగ్గులు లేవు. బూట్లు ఇవ్వలేదు. కాంగ్రెస్ పాలన ప్రజా పాలన కాదు. రాష్ట్రంలో ప్రతీకార పాలన సాగుతోంది. కళాశాల యాజమాన్యాలు విద్యార్థులకు ఫీజులు కట్టడంలేదని మెమోలు ఇవ్వడం లేదు. ఈ ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వ గురుకులాల్లో పేద విద్యార్థులు ఎంబీబీస్, ఐఐటీలు సాధించాలని సెంటర్ ఆఫ్ ఎక్ససెలెన్సు ఏర్పాటు చేశారు. ఇపుడు వాటిని ఎత్తి వేసే కుట్ర జరుగుతోంది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గెస్ట్ ఫ్యాకల్టీకి 4 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. వాళ్లు ఉద్యోగాలు మానేసేలా ప్రభుత్వం కుట్రపన్నుతోంది. పేద విద్యార్థులంటే ఎందుకు కోపం రేవంత్ రెడ్డీ?. వెంటనే గురుకుల కాలేజీల గెస్ట్ ఫ్యాకల్టీకి జీతాలు చెల్లించాలి. స్పోర్ట్స్ స్కూళ్లలో కూడా అధ్యాపకుల జీతాలు చెల్లించాలి. విద్యా భరోసా కింద ఒక్కో విద్యార్థికి రూ.5 లక్షలు ఇస్తామన్నారు. ఒక్క పైసా అయినా విడుదల చేశారా?’’ అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంశంపై బండి సంజయ్ స్పందన
ఓవైసీ వార్నింగ్ ఇస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతోంది
ప్రైవేట్ సెక్యూరిటీ వేతనంపై డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
For more TS News and Telugu News
Updated Date - Aug 30 , 2024 | 03:55 PM