ప్రైవేటు బస్సులో మహిళపై అత్యాచారం
ABN , Publish Date - Sep 23 , 2024 | 04:50 AM
ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ప్రయాణికురాలిపై లైంగిక దాడికి పాల్పడిన ఆ బస్సు హెల్పర్‌ను కూకట్‌పల్లి పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.
ప్రయాణికురాలిపై బస్సు హెల్పర్ అఘాయిత్యం
కేపీహెచ్‌బీ కాలనీ, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ప్రయాణికురాలిపై లైంగిక దాడికి పాల్పడిన ఆ బస్సు హెల్పర్‌ను కూకట్‌పల్లి పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. చౌటుప్పల్ పీఎస్ నుంచి ‘జీరో ఎఫ్‌ఐఆర్’ రావడంతో దర్యాప్తు చేపట్టి నిందితుడిని పట్టుకున్నారు. కూకట్‌పల్లి ఏసీపీ శ్రీనివాసరావు ఈ కేసు వివరాలు తెలిపారు. ఏపీకి చెందిన ఓ మహిళ(28) హైదరాబాద్‌లోని ఒకరింట్లో కేర్ టేకర్‌గా పనిచేస్తోంది.
సొంతూరు వెళ్లేందుకు ఈ నెల 18న రాత్రి 10.40 గంటలకు కూకట్‌పల్లి వై జంక్షన్‌లో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఎక్కింది. ఆమె అప్పర్ బెర్త్ బుక్ చేసుకోగా.. ఆమెపై కన్నేసిన బస్సు హెల్పర్ మాయమాటలు చెప్పి వెనకాల లోయర్ బెర్త్ ఖాళీగా ఉందని అక్కడ నిద్రపోయేలా చేశాడు. ఆ తర్వాత వాటర్ బాటిల్ ఇచ్చేందుకు వెళ్లి ఆమెతో మాటలు కలిపాడు. కొద్దిసేపటి తర్వాత ఆమె నోరు నొక్కి, కర్టన్లు మూసి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం ఎవరికైనా చెబితే పోయేది నీ పరువేనంటూ ఆమెను భయపెట్టాడు. దాంతో ఆమె మౌనంగా ఉండిపోయింది. తర్వాత మరోసారి ఆమెపై లైంగిక దాడి చేశాడు. మరుసటి రోజు ఆమె ఇంటికెళ్లిన తర్వాత జరిగిన విషయాన్ని తన యజమానికి చెప్పింది. దాంతో వెంటనే ఆమెను హైదరాబాద్‌కు పిలిపించాడు. బస్సు బయలుదేరిన సుమారు 2 గంటల తర్వాత ఘటన జరగడంతో అది చౌటుప్పల్ పరిధి కావచ్చని భావించి.. అక్కడి పీఎ్‌సలో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన చౌటుప్పల్ పోలీసులు కేసును కూకట్‌పల్లి పీఎ్‌సకు బదిలీ చేశారు.