Lagacharla Incident: వాళ్లను అరెస్ట్ చేస్తాం.. లగచర్ల ఘటనపై ఎస్టీ కమిషన్ సంచలన వ్యాఖ్యలు
ABN, Publish Date - Nov 18 , 2024 | 10:01 PM
Lagacharla Incident: వివాదాస్పదంగా మారిన లగచర్ల ఘటన గురించి జాతీయ ఎస్టీ కమిషన్ సుదీర్ఘంగా చర్చించింది. ఈ ఘటనపై కమిషన్ సభ్యులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాళ్లు ఏమన్నారంటే..
లగచర్ల ఘటన వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. రాజకీయ రంగు పులుముకోవడంతో ఈ ఘటన గురించి సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ తరుణంలో సంచలనం రేపిన ఈ ఘటనలో అరెస్టైన వారిని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు కలిశారు. వాళ్లతో 2 గంటల పాటు సమావేశమయ్యారు. సుదీర్ఘ చర్చ తర్వాత కమిషన్ సభ్యుడు జాటోత్ హుసేన్ నాయక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. లఘుచర్ల నిందితులతో మాట్లాడానని అన్నారు. మొత్తం 21 మందితో సంభాషించానన్నారు. ఊరిలో ఒక్కరు కూడా లేరన్నారు. వృద్ధులు, చిన్న పిల్లలు తప్ప ఎవరూ గ్రామంలో లేరని.. పోలీసుల నిర్వాకంతో వాళ్లు భయపడ్డారని తెలిపారు.
ఇది పక్కా కుట్ర
‘పోలీసుల నిర్వాకంతో గ్రామస్తులు భయపడ్డారు. అంతా అడవుల్లోకి పారిపోయారు. కలెక్టర్‌ను కొట్టలేదని చెబుతున్నారు. శేఖర్ అనే కార్యకర్త స్థానికంగా ఉన్న ఎస్టీలను అసభ్య పదజాలంతో దూషించాడు. ముఖ్యమంత్రి వచ్చి తమను బెదిరిస్తున్నారని బాధితులు అంటున్నారు. స్థానిక నేతలు కూడా తమను ఇబ్బంది పెడుతున్నారని చెబుతున్నారు. రాజకీయ కోణంలో కుట్ర జరిగిందని తెలిసింది. కలెక్టర్‌ను కొంతమంది ఊరిలోకి తీసుకొచ్చారు. వచ్చింది కలెక్టర్ అని అక్కడి వారికి తెలియదు. అయితే ఆయనతో వాళ్లేమీ దురుసుగా ప్రవర్తించలేదు’ అని హుస్సేన్ చెప్పుకొచ్చారు.
గ్రామంలోకి వెళ్తే ఊరుకోం
జైలులో ఉన్న వాళ్లు అమాయకులని హుస్సేన్ అన్నారు. ఎవరైతే కొట్టారో వాళ్లు జైలులో లేరని తెలిపారు. జైలులో ఉన్నవారు ఊళ్లో ఉండట్లేదని.. వారిలో కొందరు కాలేజీలకు, ఇంకొందరు కూలీ పనికి వెళ్లారని.. వాళ్లను పట్టుకొచ్చారని పేర్కొన్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే వాళ్లను తీసుకొచ్చి లోపల వేశారని చెబుతున్నారని హుస్సేన్ వ్యాఖ్యానించారు. ఇప్పటికీ రైతులు తమ భూములు వదులుకునేందుకు సిద్ధంగా లేరని ఆయన స్పష్టం చేశారు. భూమికి బదులుగా భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎస్, డీజీపీకి ఆదేశాలిచ్చామని.. ఇక నుంచి పోలీసులు గ్రామంలోకి వెళ్లేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. పవర్ ఉంది కదా అని అధికారులు, పోలీసులు అత్యుత్సాహం చూపిస్తే వారిని అరెస్ట్ చేయిస్తామని వార్నింగ్ ఇచ్చారు హుస్సేన్.
Also Read:
తెలుగు రాష్ట్రాలను ఇంగ్లీష్ అనే వ్యామోహం కమ్మేసింది
సీఎం సాబ్.. ఆ మాట మర్చిపోయారా? రేవంత్‌పై కేటీఆర్ సీరియస్
కేసీఆర్‌ను మించిన నియంతలా రేవంత్
For More Telangana And Telugu News
Updated Date - Nov 18 , 2024 | 10:02 PM