ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Mahabubabad: భర్త, పిల్లలను వదిలి.. ఇద్దరు మహిళల సహ జీవనం

ABN, Publish Date - Jun 08 , 2024 | 05:43 AM

పెళ్లయి.. కుటుంబాలతో ఉంటున్న ఇద్దరు మహిళలు.. ఇంటి నుంచి వెళ్లిపోయి సహజీవనం చేస్తుండటం మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలంలోని ఓ గ్రామంలో చర్చనీయాంశమైంది.

  • ఊరు విడిచి వెళ్లి.. మరో గ్రామంలో అజ్ఞాతవాసం

కొత్తగూడ(మహబూబాబాద్‌ జిల్లా), జూన్‌ 7: పెళ్లయి.. కుటుంబాలతో ఉంటున్న ఇద్దరు మహిళలు.. ఇంటి నుంచి వెళ్లిపోయి సహజీవనం చేస్తుండటం మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలంలోని ఓ గ్రామంలో చర్చనీయాంశమైంది. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన 30 ఏళ్ల మహిళకు కొత్తగూడ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తితో పదేళ్ల కిందట వివాహమైంది. ఈ దంపతులకు ముగ్గురు సంతానం. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల పరిసర ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల ఓ మహిళకు కొత్తగూడ మండలంలోని అదే గ్రామానికి చెందిన వ్యక్తితో ఆరేళ్ల కిందట వివాహమైంది.


వీరికి సంతానం లేదు. అయితే ఒకే గ్రామానికి కోడళ్లుగా వచ్చిన ఆ ఇద్దరు మహిళల మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఈ క్రమంలో మూడు నెలల కిందట ఆ మహిళలు తమ భర్తలు, పిల్లలను వదిలి ఇళ్ల నుంచి వెళ్లిపోయారు. గుండాల మండలంలోని ఓ గ్రామంలో సహజీవనం చేస్తున్నారు. అయితే వారి కోసం తీవ్రంగా వెతుకుతున్న భర్తలకు.. మహిళలిద్దరూ గుండాల మండలంలో ఉన్నట్టు తెలిసింది. దీంతో బుధవారం అక్కడికి వెళ్లిన భర్తలు అసలు విషయం తెలుసుకుని కంగుతిన్నారు. వారిని కొత్తగూడ మండలంలోని తమ స్వగ్రామానికి తీసుకొచ్చి గ్రామపెద్దల ముందుంచారు. ఈ క్రమంలో వారిని గ్రామపెద్దలు ప్రశ్నించగా.. ఆరు నూరైనా తాము కలిసే ఉంటామని ఆ మహిళలు చెప్పడంతో వారి కుటుంబసభ్యులు, గ్రామస్థులు విస్మయానికి గురయ్యారు.

Updated Date - Jun 08 , 2024 | 05:43 AM

Advertising
Advertising