Weather: నేడు, రేపు వర్షాలు...
ABN, Publish Date - Dec 09 , 2024 | 03:16 AM
తెలంగాణలోని పలు జిల్లాల్లో సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
పలుచోట్ల ఆదివారం దంచికొట్టిన వాన
యాదాద్రి జిల్లా బొమ్మల రామారంలో 7.5 సెంటీమీటర్ల వర్షపాతం
హైదరాబాద్, రంగారెడ్డి అర్బన్, మెదక్ అర్బన్, డిసెంబరు 9 : తెలంగాణలోని పలు జిల్లాల్లో సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉదయం వేళల్లో పొగమంచు ప్రభావం ఉంటుందని పేర్కొంది. వచ్చే వారం రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండదని పేర్కొంది. కాగా, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం వర్షం దంచికొట్టింది. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారంలో 7.5, యాదరిగిగుట్లలో 6.3, మూతకొండూరులో 6.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం కురిసిన వర్షానికి రహదారులు జలమయ్యాయి. ఆమనగల్లు, షాద్‌నగర్‌లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఆరోబోసిన ధాన్యం తడిచిపోయింది. రంగారెడ్డి, వికారాబాద్, మెదక్ జిల్లాల్లోని పలు మండలాల్లో వర్షం కురిసింది. వర్షాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
మరికాసేపట్లో వర్షం..
హైదరాబాద్ సహా పరిసర ప్రాంతాల్లో మరికాసేపట్లో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, నల్లగొండ జిల్లాలు పలు జిల్లాల్లో వర్షం పడనుందన్నారు. ఇప్పటికే ఆకాశం మేఘావృతమై ఉంది.
Updated Date - Dec 09 , 2024 | 07:17 AM