ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bank Account: ఖాతాలో ఉన్న నగదు మొత్తాన్నీ.. ఫ్రీజ్‌ చేయొద్దు!

ABN, Publish Date - Sep 17 , 2024 | 02:54 AM

సైబర్‌ నేరాలకు సంబంధించి.. నేరగాళ్లు ఎవరి బ్యాంకు ఖాతాకైనా చిన్న మొత్తంలో నగదు పంపినా.. దర్యాప్తు అధికారులు అలాంటి ఖాతాలను ఫ్రీజ్‌ చేస్తున్నారు.

  • ‘దొంగ సొమ్ము’ను మాత్రమే నిలిపివేయాలి

  • సైబర్‌ మోసాల్లో నగదు బదిలీలకు సంబంధించి మద్రాసు హైకోర్టు తీర్పు

  • అనేక మంది బాధితులకు ఊరట

  • ఖాతాలు ఫ్రీజ్‌ అవుతున్న వారిలో వందలాది మంది చిరువ్యాపారులు

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): సైబర్‌ నేరాలకు సంబంధించి.. నేరగాళ్లు ఎవరి బ్యాంకు ఖాతాకైనా చిన్న మొత్తంలో నగదు పంపినా.. దర్యాప్తు అధికారులు అలాంటి ఖాతాలను ఫ్రీజ్‌ చేస్తున్నారు. అయితే.. అలా బ్యాంకు ఖాతాను మొత్తం ఫ్రీజ్‌ చేయడం సరికాదని మద్రాసు హైకోర్టు తాజాగా తీర్పునిచ్చింది. ఎంత నగదు బదిలీ అయిందో.. అంతే మొత్తాన్ని ఫ్రీజ్‌ చేయాలని స్పష్టం చేసింది. ఈ కేసుకు.. హైదరాబాద్‌కు లింకు ఉండడం గమనార్హం..! క్రిప్టో ట్రేడింగ్‌ పేరుతో సైబర్‌ నేరగాళ్లు విసిరిన వలకు.. హైదరాబాద్‌కు చెందిన బాధితుడు చిక్కి.. సర్వం కోల్పోయాడు. అయితే.. సైబర్‌ నేరగాళ్లు తమిళనాడులోని తిరువల్లూర్‌కు చెందిన షఫియుల్లా అనే వ్యక్తి ఖాతాకు రూ.2.48 లక్షలను బదిలీ చేశారు.


అతని బ్యాంకు ఖాతాలో అప్పటికే రూ.9.69 లక్షలుండగా.. పోలీసులు మొత్తం ఖాతాను ఫ్రీజ్‌ చేశారు. ఏడాది పాటు పోలీసులు, బ్యాంకర్ల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో.. షఫియుల్లా హైకోర్టును ఆశ్రయించారు. రూ.2.48 లక్షలను మాత్రమే ఫ్రీజ్‌ చేసి, బ్యాంకు ఖాతాను పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశించడంతో సాంత్వన పొందాడు. హైదరాబాద్‌ నగరంలోనూ ఈ తరహా బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్‌ అయిన బాధితులు ఉన్నారు. పెట్రోల్‌ బంకులు, టీకొట్టు, బడ్డీకొట్టు, పచారీకొట్టు.. ఇలా చిరు వ్యాపారులకు రూ.100 లోపు బదిలీ అయిన నగదుకు సైబర్‌ నేరాలతో సంబంధాలుంటే.. మొత్తంగా బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్‌ చేస్తున్నారు.


ఇలా పదుల సంఖ్యలో ఖాతాలు ఫ్రీజ్‌ అయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఇలాంటి బాధితులకు మద్రాసు హైకోర్టు తీర్పు ఉపశమనం ఇవ్వనుంది. మద్రాసు హైకోర్టు తీర్పు నేపథ్యంలో చట్టాల సవరణ జరగాల్సి ఉంటుందని సైబర్‌ నేరాల నిపుణుడు ప్రసాద్‌ పాటిబండ్ల అభిప్రాయపడ్డారు. అయితే.. సైబర్‌ నేరాలు జరిగినప్పుడు.. కేటుగాళ్లు నగదు బదిలీ చేసే బ్యాంకు ఖాతాలన్నీ ఆటోమ్యాటిక్‌గా ఫ్రీజ్‌ అయ్యేలా ప్రస్తుతం వ్యవస్థ కొనసాగుతుందని సైబర్‌ క్రైమ్స్‌ ఏసీపీ శివమారుతి తెలిపారు. మద్రాసు కోర్టు తీర్పు నేపథ్యంలో ఇప్పుడు ఈ ప్రక్రియను బ్యాంకర్లు మాన్యువల్‌గా చేయాల్సి ఉంటుందని, ఇది చాలా క్లిష్టమైన ప్రక్రియ అని పేర్కొన్నారు.

Updated Date - Sep 17 , 2024 | 02:54 AM

Advertising
Advertising