ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kishan Reddy: అందుకే... మూడోసారి మోడీ ప్రధాని కావాలి

ABN, Publish Date - Feb 20 , 2024 | 03:50 PM

Telangana: ప్రజలు మూడోసారి మోడీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లాలో నిర్వహించిన విజయసంకల్ప యాత్రలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలో మోడీ అవినీతి రహితపాలన అందిస్తున్నారన్నారు.

మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 20: ప్రజలు మూడోసారి మోడీ
(PM Modi) ప్రధాని కావాలని కోరుకుంటున్నారని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి (Telangana BJP Chief Kishan reddy) అన్నారు. మంగళవారం జిల్లాలో నిర్వహించిన విజయసంకల్ప యాత్రలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలో మోడీ అవినీతి రహితపాలన అందిస్తున్నారన్నారు. దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ పదేళ్లలో 4 కోట్ల ఇళ్లు కట్టించటం జరిగిందన్నారు. దురదుష్టవశాత్తు తెలంగాణలో బీఆర్ఎస్ (BRS) వైఖరి వల్ల ఇళ్ల నిర్మాణం ఆశించిన స్థాయిలో జరగలేదని అన్నారు. నిరుపేదలు వైద్య కోసం ఇబ్బందులు పడకుండా కేంద్రం చర్యలు చేపడుతుందన్నారు. పేదల కోసం మోడీ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు.

‘‘గతంలో తెలంగాణలో కేసీఆర్ (BRS Chief KCR) కుటుంబం ఖానా.. పీయా.. చెలేగయా.. ఇప్పుడు తెలంగాణ సంపదను దోచుకుని లోక్‌సభ ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ (Congress) చూస్తోంది’’ అంటూ ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో టెర్రరిస్టులు, ఉగ్రవాదులు పెట్రేగిపోయారన్నారు. నేడు ఉగ్రవాదాన్ని మోడీ ఉక్కుపాదంలో అణచివేయటంతో దేశం ప్రశాంతంగా ఉందన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలు (loksabha Elections) దేశానికి సంబంధించిన ఎన్నికలనే విషయాన్ని జనాలు గమనించాలన్నారు. పిల్లల, దేశ ప్రజల ఉజ్వల భవిష్యత్ కోసం మోడీ మూడోసారి ప్రధాని కావాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో కరెంటు బిల్లులు కట్టవద్దని రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారని.. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు దొంగపార్టీలే, కుటుంబ పార్టీలే అంటూ కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 20 , 2024 | 03:54 PM

Advertising
Advertising