ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Container Fire: కంటైనర్‌లో చెలరేగిన మంటలు

ABN, Publish Date - Nov 11 , 2024 | 05:19 AM

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని రంజోల్‌ సమీపంలో 65వ నంబరు జాతీయ రహదారిపై ఆదివారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గుజరాత్‌ నుంచి జహీరాబాద్‌ మీదుగా హైదరాబాద్‌కు కంటైనర్‌లో 8 టాటా నెక్సాన్‌ కార్లను తరలిస్తుండగా షార్ట్‌సర్క్యూట్‌ జరిగి మంటలు చెలరేగాయి.

  • వాహనంతో పాటు 8 కార్లు దగ్ధం.. రూ.2 కోట్ల నష్టం

జహీరాబాద్‌, నవంబరు 10: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని రంజోల్‌ సమీపంలో 65వ నంబరు జాతీయ రహదారిపై ఆదివారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గుజరాత్‌ నుంచి జహీరాబాద్‌ మీదుగా హైదరాబాద్‌కు కంటైనర్‌లో 8 టాటా నెక్సాన్‌ కార్లను తరలిస్తుండగా షార్ట్‌సర్క్యూట్‌ జరిగి మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్‌ మేవరాం మీన వాహనాన్ని పక్కకు ఆపి మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. కాసేపటికి మరింత పెద్దఎత్తున చెలరేగాయి.


స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే పట్టణ సీఐ శివలింగం, రూరల్‌ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసినా అప్పటికే కంటైనర్‌, కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. దగ్ధమైన కార్లు, కంటైనర్‌ విలువ సుమారు రూ. 2 కోట్ల పైచిలుకు ఉంటుందని డ్రైవర్‌ తెలిపాడు. జాతీయ రహదారిపై దట్టమైన పొగ అలుముకోవడంతో పాటు మంటలు ఎగసిపడడంతో వాహనాల రాకపోకలకు అంత రాయం ఏర్పడింది. జహీరాబాద్‌ రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Nov 11 , 2024 | 05:19 AM