ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sridhar Babu: తెలంగాణ బియ్యాన్ని దిగుమతి చేసుకుంటాం

ABN, Publish Date - Nov 11 , 2024 | 03:34 AM

తెలంగాణ ఉత్పత్తి అయ్యే బియ్యాన్ని దిగుమతి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని మలేషియా దిగుమతిదారులు, పారిశ్రామికవేత్తలు పేర్కొన్నారు.

  • మంత్రి శ్రీధర్‌బాబుతో మలేసియా పారిశ్రామికవేత్తలు

  • పరిశ్రమలకు రాష్ట్రం అనుకూలం

  • వాణిజ్య సంబంధాలు బలపడాలి

  • పెట్టుబడులకు మంత్రి ఆహ్వానం

హైదరాబాద్‌, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఉత్పత్తి అయ్యే బియ్యాన్ని దిగుమతి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని మలేషియా దిగుమతిదారులు, పారిశ్రామికవేత్తలు పేర్కొన్నారు. మలేషియా పర్యటనలో ఉన్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు.. ఆదివారం కౌలలంపూర్‌లో అక్కడి పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన మలేషియా బిజినెస్‌ మీట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పండుతున్న వరి ధాన్యం రకాల గురించి తెలంగాణ వ్యవసాయ వర్సిటీ ఉప కులపతి అల్దాస్‌ జానయ్య ప్రజంటేషన్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు దిగుమతిదారులు మాట్లాడుతూ తెలంగాణలో వచ్చే బియ్యాన్ని తాము తీసుకుంటామని చెప్పగా.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని శ్రీధర్‌బాబు హామీ ఇచ్చారు. కాగా, తెలంగాణలో తాము తీసుకువచ్చిన సులభతర వాణిజ్య విధానాల వల్ల పరిశ్రమల స్థాపనకు అత్యంత అనుకూల వాతావరణం ఏర్పడిందని మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. మలేషియా తెలంగాణా దశాబ్ది ఉత్సవాలకు హాజరైన ఆయన ఆదివారం కౌలాలంపూర్‌లో పారిశ్రమికవేత్తలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మలేషియా- భారత్‌ మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలపడాలని తాము కోరుకుంటున్నట్టు వివరించారు.


  • రాజకీయాల్లో పాతికేళ్లు.. నమ్మశక్యంగా లేదు

‘అనుకోకుండా.. అనూహ్య పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చాను..నాన్న స్ఫూర్తితో ప్రజా సేవలో నిమగ్నమయ్యాను.. రాజకీయాల్లోకి వచ్చి నవంబరు10తో 25 ఏళ్లు పూర్తయ్యాయంటే.. నమ్మశక్యంగా లేదు. నేటితో సరిగ్గా పాతికేళ్లు అవుతుందన్న విషయాన్ని ఇక్కడి మిత్రులు చెప్పేదాకా నాకు గుర్తు లేదు’ అని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. రెండున్నర దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో పార్టీ తనకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చి ప్రోత్సహించిందని, సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, మల్లిఖార్జున ఖర్గేకు ఎప్పటికీ రుణపడి ఉంటానని అన్నారు.

Updated Date - Nov 11 , 2024 | 03:34 AM