Malla Reddy : హోం శాఖ ఇప్పిస్తారా..? కాంగ్రెస్‌లో చేరతా
ABN, Publish Date - Jul 31 , 2024 | 03:43 AM
‘ముచ్చటగా మూడోసారి బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి ఉంటే.. నా లెవల్ వేరే ఉండేది. నేనే హోంమంత్రి అయ్యేవాడిని’ అని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు.
మీడియాతో ఇష్టాగోష్ఠిలో మాజీ మంత్రి మల్లారెడ్డి
‘ముచ్చటగా మూడోసారి బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి ఉంటే.. నా లెవల్ వేరే ఉండేది. నేనే హోంమంత్రి అయ్యేవాడిని’ అని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలో మీడియా ప్రతినిధులతో మల్లారెడ్డి ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ‘ఈసారి మా పార్టీ అధికారంలోకి వస్తే.. ఏడాదికి నాలుగు సినిమాలు తీసేవాడినని. ఓ శాటిలైట్ ఛానల్ కూడా పెట్టేవాడిని. కాంగ్రెస్ సర్కారులో హోంశాఖ మంత్రి పదవి సీఎం దగ్గరే ఉంది. కాంగ్రెస్ వాళ్లతో మీరు మాట్లాడతారా..? నాకు హోంమంత్రిత్వ శాఖను ఇప్పిస్తారా..?’ అంటూ మీడియా ప్రతినిధులతో మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. కాగా, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రత్యేకంగా భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అసెంబ్లీలోని డిప్యూటీ సీఎం ఛాంబర్‌కు వెళ్లిన మల్లారెడ్డి.. ఆయనతో చాలాసేపు మాట్లాడినట్లు తెలుస్తోంది.
Updated Date - Jul 31 , 2024 | 03:43 AM